📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Telugu News:TG High Court: హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు తీవ్ర హెచ్చరిక

Author Icon By Pooja
Updated: November 15, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు(TG High Court) కఠిన సూచనలు జారీ చేసింది. మీ వద్ద ఉన్న అధికారాన్ని వినియోగించడం మంచిదే కానీ, దాన్ని శాసనసమ్మతంగా, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉపయోగించాలని న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్‌ సేన్‌ రెడ్డి(B. Vijay Sen Reddy) వ్యాఖ్యానించారు. రోజూ హైడ్రాపై వందలాది పిటిషన్లు వస్తుండటంతోనే కమిషనర్‌ను వ్యక్తిగతంగా విచారణకు పిలవాల్సి వచ్చిందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Read Also: Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకున్న గ్రామస్తులు

TG High Court

హైకోర్టు వ్యాఖ్యలు

ఖానామెట్ గ్రామంలోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనుల్లో కోర్టు ఇచ్చిన యథాతథ స్థితి ఆదేశాలు ఉల్లంఘించారనే ఆరోపణలపై విచారణ జరుగుతూ, న్యాయమూర్తి(TG High Court) ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చడం, ప్రజల ఆస్తులను నష్టం కలిగించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. చిన్న గజాల ప్లాట్లు కొనుగోలు చేసిన సాధారణ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టడం సమంజసం కాదని ప్రశ్నించింది.

ఎఫ్టీఎల్‌ పరిధిలో కూడా సక్రమమైన పట్టా భూములు ఉండొచ్చన్న మరో బెంచ్ తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. “అధికారమే అంతిమం కాదు… పద్ధతి, చట్టం, విధానం కీలకం” అని కోర్టు హైడ్రాకు హెచ్చరిక జారీ చేసింది. భవిష్యత్‌లో మళ్లీ కోర్టుకు హాజరయ్యే పరిస్థితి రానీయకుండా వ్యవహరించాలని కమిషనర్‌కు సూచించింది.

పిటిషనర్ల వాదనలు

పిటిషనర్ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ—

కమిషనర్ వివరణ

విచారణలో కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ—

ప్రభుత్వ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ హైడ్రా చర్యలు చట్టప్రకారమే జరిగాయని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Hyderabad News HYDRA Actions Latest News in Telugu legal case Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.