📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

TG High Court: సెర్చ్ వారెంట్ల జారీ విధానంపై స్పష్టతనివ్వాలి: హైకోర్టు

Author Icon By Anusha
Updated: January 4, 2026 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పోలీసుల చర్యలపై హైకోర్టు (TG High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులు తమంతట తాముగా సెర్చ్ వారెంట్లు జారీ చేస్తున్న వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Read also: Sankranti: సంక్రాంతి సీజన్‌లో ప్రైవేటు బస్సుల ఛార్జీల మోత

సెర్చ్‌ వారంట్లు జారీ చేసే అధికారం పోలీసులకు ఎక్కడిదని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. పిటిషనర్ విజయగోపాల్ వ్యక్తిగత హోదాలో వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్‌ 93, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 47లను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌లకు మాత్రమే ఉన్న అధికారాలను వినియోగిస్తూ కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ పేరుతో తనిఖీలు చేపడుతున్నారని తెలిపారు.

TG High Court: Clarification should be given on the procedure for issuing search warrants

కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ పేరుతో తనిఖీలు

నేరస్థులు, అక్రమ వలసదారుల కోసం అంటూ సెర్చ్‌ వారంట్‌ లేకుండానే ఇళ్లలోకి ప్రవేశించి గుర్తింపు పత్రాలు అడుగుతున్నారని ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం, సీఆర్పీసీ లేదా బీఎన్‌ఎస్‌లోని ఏ నిబంధనలు, జీవోల ఆధారంగా పోలీసులు సెర్చ్‌ వారంట్లు జారీ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ప్రజాభద్రత నిమిత్తం పోలీసులు చేస్తున్న కృషిని అభినందించాల్సిందేనని వ్యాఖ్యానిస్తూ.. సెర్చ్‌ వారంట్లు జారీ చేసే అధికారం పోలీసులకు ఉందా లేదా అన్న అంశంపై ఆధారాలతో సహా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

High Court order Hyderabad City Police Act latest news search warrant rules Section 47 issue Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.