📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

TG: గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్ రావు

Author Icon By Saritha
Updated: February 5, 2026 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(TG) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో రెండేళ్లలో మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేసుకుందామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఏమీ చేయరని విమర్శించారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ, మనల్ని బాగా చూసుకునే వారికే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: Nellore Crime: అనుమానంతో భార్యపై హత్యాయత్నం

ఒకప్పుడు పందులతో ఉన్న గజ్వేల్ ఆసుపత్రి కేసీఆర్ వచ్చాక ఎలా అయిందో అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. (TG) ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది కానీ వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ఇవ్వలేదు కానీ బంగారం ధర మాత్రం భారీగా పెరిగిందని అన్నారు. అప్పుడు బంగారం ఆశపెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు.

కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై తిట్ల వర్షం కురిపించడం తప్ప రేవంత్ రెడ్డికి తెలిసిందేమీ లేదని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్‌లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. ఎన్నికల తర్వాత రైతు బంధు ఇస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ ఈ నెల 11 లోపు ఇవ్వకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే అభివృద్ధి విషయంలో కేసీఆర్‌తో పోటీ పడాలని సవాల్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BRS party Election campaign Gazwel Municipal Elections harish rao KCR Latest News in Telugu Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.