హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రాబోయే దశాబ్దంలో పండ్ల కొరత గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత ఉత్పత్తి స్థాయిలు మరియు భవిష్యత్తు డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, 2035 నాటికి రాష్ట్రంలో 5 లక్షల టన్నులకు పైగా పండ్ల ఉత్పత్తి కొరత ఏర్పడుతుందని తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం అంచనా వేసింది. 2035 నాటికి పండ్ల డిమాండ్ 23.74 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని, సరఫరా, డిమాండ్‌ల మధ్య అంతరం 5.09 లక్షల టన్నులుగా ఉంటుందని ప్రణాళికలో స్పష్టం చేసింది.
Read Also: CRDA : సిఆర్డిఎ భవనం ప్రారంభం
ఉద్యానవన రంగంలో అడ్డంకులు
రాష్ట్రంలో ఉద్యానవన పంటల(crops) ఉత్పత్తి లాభదాయకంగా లేకపోవడానికి అనేక అడ్డంకులు ప్రతిబంధకాలుగా ఉన్నాయి. నాణ్యమైన మొక్కలు సకాలంలో అందుబాటులో లేకపోవడం, కూలీల కొరత, అధిక కూలీ రేట్లు, సరైన యంత్రాలు, మార్కెటింగ్ సమస్యలు, అధిక రవాణా ఖర్చులు, యూనిట్ ప్రాంతానికి తక్కువ రాబడి వంటివి ఇందులో ప్రధానమైనవి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 11.91 లక్షల ఎకరాల్లో మామిడి, నారింజ, నిమ్మ, జామ, దానిమ్మ, టమోటా, వంకాయ, ఆయిల్ పామ్, మిరప, పసుపు వంటి పంటలు సాగు చేస్తున్నారు.
సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యం
రాష్ట్ర స్థూల పంట విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు ఆరు శాతం ఆక్రమించాయి. రాష్ట్ర వ్యవసాయ(agricultural) స్థూల విలువ ఉత్పత్తికి ఈ పంటలు 30 శాతం దోహదపడుతున్నాయి. అయినప్పటికీ, కూరగాయల పంటల విస్తీర్ణం గత దశాబ్దంలో –18.4 శాతం ప్రతికూల వృద్ధిని చూసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సాగు విస్తీర్ణాన్ని దాదాపు 31 శాతం పెంచాల్సిన అవసరం ఉందని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. రాబోయే ఐదేళ్లలో అదనంగా 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో టమోటా, వంకాయ, క్యారెట్, క్యాబేజీ, ముల్లంగి వంటి కూరగాయల సాగు కోసం విస్తరించాలని ఉద్యానవన విశ్వవిద్యాలయం ప్రణాళికలో పేర్కొంది.
2035 నాటికి తెలంగాణలో ఎంత పండ్ల లోటు ఏర్పడుతుందని అంచనా?
2035 నాటికి 5 లక్షల టన్నులకు పైగా (4.53 – 5.09 లక్షల టన్నులు) పండ్ల ఉత్పత్తి కొరత ఏర్పడుతుందని అంచనా.
ఉద్యానవన పంటల ఉత్పత్తి లాభదాయకం కాకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
నాణ్యమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం, కూలీల కొరత, మార్కెటింగ్ సమస్యలు మరియు అధిక రవాణా ఖర్చులు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: