📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ నేటి బంగారం ధరలు LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ నేటి బంగారం ధరలు LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20

TG: ఆ ప్రదేశంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్..

Author Icon By Rajitha
Updated: December 23, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 65పై పాదచారుల భద్రతను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హయత్‌నగర్ సమీపంలోని భాగ్యలత మరియు లెక్చరర్స్ కాలనీ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జుల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వంతెనల పనులను మూడు నెలల్లో పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఖరారు చేశారు.

Read also: VenkaiahNaidu: విద్య, వైద్యం తప్ప మిగతావి ఫ్రీగా అవసరం లేదు

TG

హయత్‌నగర్ ప్రాంతంలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడంతో రహదారి దాటే పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సరైన సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం, విద్యాసంస్థలు ఎక్కువగా ఉండటంతో ఉదయం–సాయంత్రం వేళల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జుల నిర్మాణం అత్యవసరంగా మారింది.

ఇదిలా ఉండగా, జాతీయ రహదారి విస్తరణ పనులకు కొందరు ప్రైవేటు ఆస్తుల యజమానులు కోర్టు స్టే ఉత్తర్వులు తీసుకురావడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలే అత్యంత ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన, అవసరమైతే పోలీసు బందోబస్తుతోనైనా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జులు పూర్తయితే ఎన్‌హెచ్‌ 65పై ప్రమాదాలు తగ్గి, పాదచారులు సురక్షితంగా రహదారి దాటే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

FootOverBridge Hayathnagar latest news NH65 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.