రాష్ట్రంలో(TG govt) చేయూత పింఛన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు సెర్ప్ (Society for Elimination of Rural Poverty) చర్యలు ప్రారంభించింది. పింఛన్ల చెల్లింపు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక తనిఖీలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది.
read also: Kalvakuntla Kavitha: వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తా: కవిత

ఈ తనిఖీల ద్వారా ప్రతి లబ్ధిదారుడు సరైన హక్కు పొందుతున్నాడా లేదా అన్న అంశాన్ని నిర్ధారించనున్నారు. దీనికోసం సంబంధిత ఎంపీడీవోలకు, మండల పింఛన్ ఇన్‌ఛార్జ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. చేయూత పింఛన్‌లకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ఎటువంటి లోపాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదే విధంగా, పింఛన్ పంపిణీ మరియు చెల్లింపు ప్రక్రియలో ప్రభుత్వ(TG govt) మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. లబ్ధిదారులకు సమయానుకూలంగా పింఛన్లు చేరేలా చర్యలు తీసుకోవాలని, ఏవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించాలని కూడా సూచించారు. సెర్ప్(Serp) అధికారులు ఈ సామాజిక తనిఖీలు పూర్తయ్యాక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో పింఛన్ పంపిణీ వ్యవస్థలో మార్పులు, మెరుగుదలలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: