📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TG Govt School: స్కూల్లో కంప్యూటర్ టీచర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

Author Icon By Tejaswini Y
Updated: November 6, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం(TG Govt School) ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, కంప్యూటర్ టీచర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ చర్యతో విద్యార్థులకు సాంకేతిక విద్యను మరింత చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న 2,837 పాఠశాలలను అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.15,000 గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ ఖర్చును సమగ్ర శిక్షా నిధుల ద్వారా భరించనున్నారు.

Read Also: Roja: సినిమాల్లోకి ప‌దేళ్ల త‌ర్వాత‌..రీఎంట్రీ ఇస్తున్న రోజా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో సుమారు 20 ఏళ్ల క్రితం 4,200 పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఐదేళ్లపాటు ఇన్‌స్ట్రక్టర్లను నియమించినప్పటికీ, ఆ తర్వాత వారిని తొలగించడంతో ల్యాబ్‌లు నిరుపయోగంగా మారాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అనేక కంప్యూటర్లు పాడై మూలకు చేరాయి.
ఇప్పుడు మళ్లీ నియామకాలు చేపట్టడం ద్వారా ల్యాబ్‌లను తిరిగి ప్రారంభించి, విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడంలో బోధకులు కీలక పాత్ర పోషించనున్నారు.

TG Govt School: ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అమలవుతున్న పలు డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్(Digital learning programs) విజయవంతానికి ఈ కొత్త నియామకాలు దోహదం చేయనున్నాయి.
ఏక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారంతో 1,354 పాఠశాలల్లో అమలు చేస్తున్న అసిస్టెడ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, అలాగే తాజాగా ప్రారంభించిన ఖాన్ అకాడమీ ఆన్‌లైన్ క్లాసులు సమర్థవంతంగా నడవాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న బోధకులు అవసరం ఉంది.

ఈ నియామకాలతో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు తిరిగి చురుకుగా మారి, డిజిటల్ విద్యాబోధనకు కొత్త దిశ లభిస్తుందని విద్యాశాఖ అధికారులు నమ్ముతున్నారు.
రాష్ట్రంలోని విద్యార్థులు సాంకేతిక విద్యలో ముందంజలో ఉండేలా ఈ నిర్ణయం సహాయపడనుందని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

ComputerEducation DigitalClassrooms DigitalLearning EkkStepFoundation GovernmentSchools ICTInstructors TelanganaEducation TelanganaNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.