📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: TG Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త: వచ్చే జూన్‌కి తెలంగాణలో లక్ష ఉద్యోగాలు!

Author Icon By Pooja
Updated: December 5, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్ర ప్రభుత్వం(TG Govt Jobs) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, గత రెండు సంవత్సరాల్లో తెలంగాణలో 61,379 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించింది. రాబోయే ఆరు నెలల్లో ఇంకా ఒక లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అందులో పేర్కొంది.

Read Also: AP TET 2025: టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

TG Govt Jobs: Good news for the unemployed: One lakh jobs in Telangana by next June!

మునుపటి ప్రభుత్వ కాలంలో నియామకాలపై స్పష్టత లేక నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనగా, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో తక్షణమే నియామక ప్రక్రియలు, ఉద్యోగ మేళాలు, సమయానికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేయడం వల్ల యువతలో మరోసారి నమ్మకం పెరిగిందని నివేదిక వెల్లడించింది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం – కీలక నియామకాల విశ్లేషణ

డిసెంబర్ 7తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(TG Govt Jobs) పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం వివిధ విభాగాల్లో చేపట్టిన నియామకాలపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 61,379 ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యేక రికార్డు సృష్టించామని, ఇంకా 8,632 పోస్టులు చివరి దశలో ఉన్నట్లుగా నివేదిక వివరించింది. ఇలా ఇప్పటివరకు మొత్తం 70,011 పోస్టుల నియామకాలు పూర్తి చేసినట్లు తెలియజేసింది. విద్య, వైద్య-ఆరోగ్యం, పోలీస్ శాఖ, ఇంధన సంస్థలు, పరిపాలనా విభాగాలు వంటి కీలక రంగాల్లో నియామకాలను ప్రాధాన్యతతో చేపట్టినట్లు పేర్కొంది.

TGPSC పునర్నిర్మాణం – కీలక సంస్కరణలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పునరుద్ధరణను ప్రభుత్వం ప్రధాన సంస్కరణలుగా చేపట్టింది. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న పరీక్షలను వేగంగా నిర్వహించడం, వయోపరిమితి సడలింపులు ఇవ్వడం, ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయడం వంటి చర్యలు కీలక మలుపుగా నివేదికలో పేర్కొంది.

గ్రూప్ పరీక్షలు – వివాదాల నుంచి విజయవంతమైన నిర్వహణ వరకు

గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీల కారణంగా అస్తవ్యస్తమైన గ్రూప్ పరీక్షా వ్యవస్థను పునర్నిర్మించినట్లు నివేదిక తెలిపింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Latest News in Telugu RecruitmentDrive RevanthReddy TelanganaEmployment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.