📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

Latest News: TG Govt: ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వారికి సర్కార్ షాక్ 

Author Icon By Anusha
Updated: November 16, 2025 • 10:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో (TG Govt) కొత్త వాహనాలు కొనుగోలు చేసి వాటికి ఫ్యాన్సీ నంబర్లను రిజర్వ్ చేసుకోవాలనుకునే వాహనదారులకు రవాణా శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఇంతకాలం వరకు అందుబాటులో ఉన్న ప్రత్యేక నంబర్ల రిజర్వేషన్ ఫీజులను ప్రభుత్వం అకస్మాత్తుగా మూడు రెట్లు వరకు పెంచుతూ నూతన ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Ramoji Rao: నేడు రామోజీ ఎక్స్‌లెన్స్‌ నేషనల్ అవార్డ్స్‌ కార్యక్రమం

‘మోటారు వెహికిల్స్‌ రూల్స్‌-1989’లోని నిబంధన 81కి సవరణ చేస్తూ రవాణా శాఖ శనివారం జీవో 77ను జారీ చేసింది. గతంలో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో.. ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఇందులో ప్రత్యేక నంబర్లకు చెల్లించాల్సిన కొత్త రేట్లను స్పష్టంగా వెల్లడించింది.

ఈ పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.ముఖ్యమైన, అత్యధిక డిమాండ్ ఉన్న ఫ్యాన్సీ నంబర్ల రిజర్వేషన్ ఫీజులు భారీగా పెరిగాయి. 9999 నెంబర్‌కు గతంలో రూ. 50 వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 1.50 లక్షలకు పెంచారు. 0009.0001 నెంబర్‌కు గతంలో రూ. 50వేలు ఉండగా.. ప్రస్తుతం రూ. లక్షకు పెంచారు. 6666 నెంబర్‌కు గతంలో రూ. 30 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.లక్షకు పెంచారు.

భారీ పెంపుదల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం

ఈ భారీ పెంపుదల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఫ్యాన్సీ నంబర్ల కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల పెంపు సరైనదేనని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక నంబర్లకు దరఖాస్తు, వేలం విధానంప్రత్యేక నంబర్లను కేటాయించే విధానంలో ఎటువంటి మార్పు లేదు, కానీ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో పారదర్శకంగా జరుగుతుందిని అధికారులు వెల్లడించారు.

ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

fancy-numbers-hike latest news telangana-transport-department Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.