📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG Governor Jishnu Dev Varma- శాస్త్రవిజ్ఞానంతో వికసిత్ భారత్

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 10:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గుంటూరు : శాస్త్రవిజ్ఞానం ప్రజల,పురోభివృద్ధికి తోడ్పడేందుకు డా. యలవర్తి నాయుడమ్మ తపించారనీ, ఆదిశగా జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను సాధించారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Telangana State Governor Jishnu Dev Varma) కొనియాడారు. బుధవారం తెనాలిలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం లో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ యలవర్తి నాయు డమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి త్వశాఖ ఆర్థిక సేవల విభాగం సెక్రటరీ నాగరాజు మద్దిరాల, డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపాటి రఘునాధబాబు, జాతీయ చర్మ పరిశోధనా సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్ స్వర్ణ వి. కాంత్ పాల్గొన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆర్థిక సేవల విభాగం

సభలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆర్థిక సేవల విభాగం సెక్రటరీ నాగరాజు మద్దిరాలకు ప్రదానం చేశారు. ఈ సంధర్భంగా జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ శాస్త్రవిజ్ఞానాన్ని గ్రామీణు లకు చేరువచేసిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డు (Dr. Yelavarthi Naidamma Award) ను ఆర్థికరంగంలో పీపుల్స్ అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపును పొందిన మద్దిరాల నాగరాజుకు బహూకరిం చటం సముచితమన్నారు. వికసిత్ భారత్కు వెన్నెముక అయిన ఆర్థికరంగంలో నాగరాజు, పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లారని చెప్పారు.

నాగరాజుతో బడ్జెట్ రూపకల్పనలో అనుభవాన్ని

త్రిపుర రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి /ఫైనాన్స్ మంత్రిగా ఉన్నపుడు ఆ రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శిగా ఉన్న నాగరాజుతో బడ్జెట్ రూపకల్పనలో అనుభవాన్ని ఈ సందర్భంగా గవర్నర్,గుర్తుచేసుకున్నారు. అవార్డు గ్రహీత కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆర్థిక సేవల విభాగం సెక్రటరీ నాగరాజు (Nagaraju, Secretary, Department of Financial Services, Ministry of Finance.) మద్దిరాల మాట్లాడుతూ భారతదేశం ఆధునికతను సంతరించుకుంటున్న రోజుల్లో డాక్టర్ నాయుడమ్మ తన పరిశోధనలు,

ఆవిష్కరణల ప్రయోజనాలను పరిశ్రమలకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చేశారని చెప్పారు. సైన్స్ ను గ్రామాలు, రైతులు, సామాన్యుల వద్దకు తీసుకెళ్లటం ఆయన విశిష్టతగా అన్నారు. ఇటీవలి కాలంలో మన గ్రామీణ భారతదేశం గొప్ప ప్రతిభను చాటిందన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలు రూ.23 లక్షల కోట్లకు పైగా, 7 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులతో రూ.10 లక్షల కోట్ల రుణం అందినట్టు తెలిపారు.

Nara Lokesh

డిజిటల్ నిర్మాణం కేవలం జాతీయ విజయం

84 లక్షలకు పైగా ఎసెచ్ గ్రూపులకు రూ.3 లక్షల కోట్ల రుణాలు అందటం గ్రామీణ పారిశ్రామికతకు నిదర్శనంగా చెప్పారు. దేశంలోని ఎంఎస్ఎంఈలు 11 కోట్లమందికి పైగా ఉపాధిని కల్పిస్తూ వికసిత్ భారత్కు ఇంజిన్లుగా ఉన్నాయన్నారు. అలాగే డిజిటల్ మోలిక వసతులు వికసిత్ భారత్కు పునాదిగా నాగరాజు చెప్పారు.

యూపీఐ ప్రతి నెలా బిలియన్లకొద్దీ లావాదేవీలను చేస్తోందని గుర్తుచేశారు. ఈ డిజిటల్ నిర్మాణం కేవలం జాతీయ విజయం మాత్రమే కాదనీ, ప్రపంచానికి ఒక నమూనాగా వివరించారు. వీటన్నిటికీ భారతీయ వాణిజ్యబ్యాంకులు విక్సూచిగా ఉన్నాయని చెప్పారు. జాతీయ చర్మ పరిశోధనా సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్ స్వర్ణ వి. కాంత్ మాట్లాడుతూ డాక్టర్ నాయుడమ్మను నేషన్ బిల్డర్గా అభివర్ణించారు.

నాయుడమ్మ చూపిన బాటలో అధిగమనిస్తామని

దేశంలోని 37 జాతీయ పరిశోధనశాలలకు అధిపతిగా చేసిన నాయుడమ్మ తమందరికీ ఎంతో స్పూర్తిగా చెప్పారు. విదేశాలు టారిఫ్లు పెంచిన నేపథ్యంలో ఎగుమతులు ప్రధానమైన తోలు పరిశ్రమలో 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల వృద్ధి నిజంగా మాకు సవాలుగా చెబుతూ నాయుడమ్మ చూపిన బాటలో అధిగమనిస్తామని ధీమావ్యక్తంచేశారు. సభలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డాక్టర్ యలవర్తి నాయుడమ్మ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆర్థిక సేవల విభాగం సెక్రటరీ నాగరాజు మద్దిరాల బయోగ్రఫీ పై రూపొందించిన వీడీయో లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-greenfield-expressway-route-finalized-in-hyderabad/andhra-pradesh/545039/

Breaking News coalition government criticism latest news medical colleges development Nara Lokesh PPP model privatization debate TDP vs YSRCP Telugu News YS Jagan Mohan Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.