📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG: ఇద్దరు పిల్లల నిబంధన రద్దుకు గవర్నర్ ఆమోదం

Author Icon By Aanusha
Updated: November 5, 2025 • 9:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి విధించిన ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అనేక మంది అభ్యర్థులకు మార్గం సుగమమైంది.

Read Also: HYD-VJA : హైదరాబాద్ – విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్

మంగళవారం గవర్నర్ (Governor Jishnu Dev Verma) సంబంధిత ఆర్డినెన్స్‌పై సంతకం చేయడంతో ఈ నిర్ణయం అధికారికంగా అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నేడు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు (జీఓ) విడుదల చేయనుంది. ఈ ఉత్తర్వుల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పేర్కొంటూ

భారతదేశంలో కుటుంబ నియంత్రణ చర్యలను ప్రోత్సహించే ఉద్దేశంతో.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థలు (గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ), పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్రంలో 1994లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నిబంధన 1995 మే 31 నుంచి అమలులోకి వచ్చింది.

TG

ఈ నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018, పురపాలక చట్టం 2019లను సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీకి గత నెల 23న జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీర్మానించింది.

దీని ద్వారా స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ

ఈ నిబంధన కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా అనేకమంది రాజకీయంగా చురుకైన వ్యక్తులు స్థానిక ప్రజాప్రతినిధులుగా మారే అవకాశాన్ని కోల్పోయారు. ముఖ్యంగా, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం, సమర్థ నాయకత్వానికి ఈ నిబంధన ఆటంకంగా ఉందని భావించిన ప్రభుత్వం.. ఈ ఎన్నికలలో పౌరులందరికీ సమాన అవకాశం కల్పించే ఉద్దేశంతో సవరణ చేపట్టింది.మంత్రిమండలి తీర్మానం తర్వాత..

(TG) రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను అదే నెల 24న గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అంశంపై న్యాయసలహా తీసుకున్న తరువాత.. తాజాగా దీనికి ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, నగరపాలక, పురపాలక ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా ఇకపై స్వేచ్ఛగా పోటీ చేయడానికి అవకాశం ఏర్పడింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

JishnuDevVarma latest news LocalElections ordinance TelanganaGovernment Telugu News TwoChildPolicy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.