📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Latest News: TG: GHMCలో కొత్త వార్డుల సంఖ్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Author Icon By Saritha
Updated: December 9, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిని విస్తరించే దిశగా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీలో(TG) వార్డుల సంఖ్యను 300గా ఖరారు చేస్తూ ప్రభుత్వం తాజా జీఓ జారీ చేసింది. శివార్లలోని మొత్తం 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తున్న నేపథ్యంలో కొత్తగా ఈ వార్డుల పునర్విభజన చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో కొత్త ఫ్రేమ్‌వర్క్ సిద్ధమైంది. ఈ ప్రతిపాదనలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రభుత్వం పరిశీలనకు పంపగా, ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి 1955 జీహెచ్‌ఎంసీ చట్టం సెక్షన్ 5, 8(1) ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ జీఓపై సంతకం చేశారు. విలీనం పూర్తయ్యాక జీహెచ్‌ఎంసీ పరిధి 2,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. దీని వల్ల ఈ శివార్ల ప్రాంతాలు కూడా కోర్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుండగా, అంతకుముందే విలీనం ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. విలీనం పూర్తైన తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రకటన వెలువడనుంది.

Read also:  డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు

విలీనం కానున్న 27 మున్సిపాలిటీలు

పెద్ద అంబర్‌పేట్,(TG) జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బోడుప్పల్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

GHMC wards Greater Hyderabad Hyderabad Expansion Latest News in Telugu Municipal Merger telangana government Telangana news Telugu News Urban Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.