📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

News Telugu: TG Government: సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ

Author Icon By Rajitha
Updated: October 16, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG Government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నించగా, సుప్రీంకోర్టులో కీలక నిర్ణయం వెలువడింది. సర్వోన్నత న్యాయస్థానం రిజర్వేషన్లు 50 శాతం మించరాదు అని స్పష్టంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు, అవసరమైతే పాత రిజర్వేషన్ల విధానంతోనే ఎన్నికలు నిర్వహించవచ్చని, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో (High court) కేసు పెండింగ్‌లో ఉన్నందున సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని చెప్పారు. వివరాల ప్రకారం, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీఓ 9పై హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ధర్మాసనంలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా విచారణ చేశారు.

BJP: బిసి బంద్ కు బిజెపి మద్దతు: రాంచందర్రావు

TG Government

ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రీజనింగ్ వివరించారు, రాష్ట్రంలో కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్లు పెంచడమే శాస్త్రీయ నిర్ణయం, అసెంబ్లీలో అన్ని పార్టీలు దీనికి ఏకాభిప్రాయం తెలిపారు అని చెప్పారు. అయితే, గత సుప్రీంకోర్టు తీర్పు (కృష్ణమూర్తి కేసు) ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టమని ప్రతివాదుల తరఫు న్యాయవాది వాదించారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేదని, అయితే హైకోర్టులో విచారణను కొనసాగించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై కొత్త ఉత్కంఠను సృష్టించింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తదుపరి చర్చలు, కేబినెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఊహిస్తున్నారు.

సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై ఏమి తీర్పు ఇచ్చింది?
సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసి, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టంగా తెలిపింది.

అవసరమైతే ఏ విధంగా ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది?
పాత రిజర్వేషన్ల విధానాన్ని అనుసరించటం ద్వారానే స్థానిక ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BC Reservations latest news Local elections Supreme Court Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.