📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG: ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రూ.3,200 కోట్లతో భద్రతా కవచం

Author Icon By Rajitha
Updated: November 20, 2025 • 2:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై ఈ జోన్ పరిధిలో కొన్ని ప్రధాన మార్గాల్లో రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచేలా అనుమతి లభించింది. అధిక వేగ రైళ్లను సురక్షితంగా నడపడానికి రైల్వే భారీ స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటోంది. ట్రాక్‌లపైకి పశువులు, పాదచారులు, వాహనాలు ప్రమాదవశాత్తు ప్రవేశించకుండా ఉండేందుకు ఈ-ఫెన్సింగ్‌తో పాటు సరిహద్దు గోడల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 3,200 కోట్ల రూపాయలు కేటాయించారు.

Read also: KTR: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం

Good news for train passengers.. Safety shield with Rs. 3,200 crore

410 కిలోమీటర్ల పొడవున సరిహద్దు గోడలు

సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 4,429 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్–గోడల నిర్మాణ పనులు చేయాలని ప్రణాళిక ఉంది. అందులో 4,019 కిలోమీటర్ల మేర ఈ-ఫెన్సింగ్ నిర్మాణానికి 2,055 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. అలాగే 410 కిలోమీటర్ల పొడవున సరిహద్దు గోడలు నిర్మించడానికి 1,136 కోట్లు అంచనా వ్యయం. ప్రస్తుతం వివిధ డివిజన్లలో సుమారు 875 కిలోమీటర్ల మేర పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఫెన్సింగ్ వ్యవస్థ బలంగా ఉండటంతో పాటు, ట్రాక్‌ల సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్ లైన్ల వల్ల ప్రమాదం లేకుండా ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రైల్వే పరికరాలు, ట్రాలీలను తరలించడానికి అవసరమైన చోట ఖాళీ కూడా ఉంచుతున్నారు.

అత్యధిక రద్దీ ఉండే మార్గాలకు ప్రాధాన్యం ఇస్తూ, ముఖ్యంగా సికింద్రాబాద్–కాజీపేట, కాజీపేట–బల్హర్షా, విజయవాడ–కొండపల్లి, గూటి–వాడి వంటి ముఖ్య సెక్షన్లలో ఫెన్సింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నివాస ప్రాంతాలు లేదా రైల్వే స్టేషన్లకు సమీపంలో, ప్రజలు సురక్షితంగా ట్రాక్‌లను దాటేందుకు చిన్న వాహనాలు, పశువులు వెళ్లేందుకు అనువుగా సబ్‌వేలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తవుతే రైళ్ల వేగం పెరగడమే కాకుండా, ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయని రైల్వే అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

high-speed latest news railways Safety SCR Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.