📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

TG: రైతులకు శుభవార్త: యూరియా బుకింగ్ యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ

Author Icon By Pooja
Updated: January 21, 2026 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(TG) రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. యూరియా కొరత సమస్యకు చెక్ పెట్టేలా, రైతులు తమ మొబైల్ ఫోన్ నుంచే అవసరమైన యూరియాను నేరుగా బుక్ చేసుకునే విధంగా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా రైతులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, యూరియా పొందడం మరింత సులభమైంది.

Read Also: Urban Forests : తెలంగాణ లో మరో 6 అర్బన్ ఫారెస్ట్ లు

TG: Good news for farmers: The urea booking app is being expanded statewide.

పైలెట్ ప్రాజెక్ట్ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు

ఇప్పటికే ఈ యూరియా బుకింగ్ యాప్‌ను ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, నిమిషాల్లోనే యూరియా బుకింగ్ పూర్తయ్యే సౌకర్యం రైతులకు లభించింది. ఈ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యాప్ సేవలను ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

అక్రమ నిల్వలకు అడ్డుకట్ట, పారదర్శకత పెంపు

ఆన్‌లైన్ బుకింగ్ విధానం వల్ల యూరియా నిల్వలపై పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. ఏ ప్రాంతంలో ఎంత స్టాక్ ఉందో స్పష్టంగా తెలుస్తుండటంతో అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం తగ్గుతోంది. రైతులు తమ పంట అవసరానికి తగ్గట్టుగా మాత్రమే యూరియా బుక్ చేసుకునే విధానం ఉండటంతో సమతుల్య పంపిణీ సాధ్యమవుతోంది.

వ్యవసాయ రంగంపై సమీక్ష – విజన్ 2047 లక్ష్యం

సెక్రటేరియట్‌లో(TG) జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. విజన్-2047 లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, వ్యవసాయ యాంత్రీకరణను మరింత ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఆర్గానిక్ పంటలకు ప్రత్యేక సర్టిఫికేషన్ యాప్

ఆర్గానిక్ పంటల పేరుతో నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో విక్రయించబడుతున్న నేపథ్యంలో, దీనికి పరిష్కారంగా మరో కొత్త యాప్‌ను తీసుకురానున్నారు. ఈ యాప్ ద్వారా ఆర్గానిక్ పంటలు ఎక్కడ, ఎలా పండించారనే పూర్తి వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. రైతులకు సర్టిఫికేషన్ లభించడంతో పాటు, వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులను గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యాప్ అభివృద్ధి దశలో ఉండగా, త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu TelanganaFarmers UreaBookingApp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.