TG: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో పదేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఎట్టకేలకు శుభవార్త లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుని, ఈ శాఖలో పనిచేస్తున్న 53 మంది అధికారులకు ప్రమోషన్లు కల్పించేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 2025 చివర్లో పలు పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకూ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి.
Read also: BV Raghavulu: ప్రమాదకర చట్టాలకు కేంద్రం ఆమోదం
Good news for Excise Department
పై హోదాలకు వెళ్తే అవి కోల్పోతామనే భయంతో
డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 23 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 14 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 12 మంది డిప్యూటీ కమిషనర్లతో పాటు అడిషనల్, జాయింట్ కమిషనర్లకు పదోన్నతులు కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఈ శాఖలో సమగ్రంగా పదోన్నతులు జరగకపోవడంతో అర్హులైన అధికారులు ఏళ్ల తరబడి నిరీక్షణలోనే ఉన్నారు.
అయితే పదోన్నతులు ఇంతకాలం ఆలస్యం కావడానికి ప్రధాన కారణంగా క్షేత్రస్థాయి అధికారాల అంశం మారింది. డిప్యూటీ కమిషనర్లకు మాత్రమే తనిఖీ అధికారాలు ఉండటంతో, పై హోదాలకు వెళ్తే అవి కోల్పోతామనే భయంతో కొందరు అధికారులు ప్రమోషన్లు వద్దని లేఖలు రాసిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఈ కారణంగా కిందిస్థాయి అధికారుల పదోన్నతులూ నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్యకు ముగింపు పలికినట్టుగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: