📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

News Telugu: TG: డెలివరీ బాయ్స్‌కు శుభవార్త! కొత్త బిల్లు ఆమోదం..

Author Icon By Rajitha
Updated: November 18, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG: తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో దేశంలోనే తొలిసారిగా గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్న రాష్ట్రంగా తెలంగాణ (Telangana) నిలుస్తోంది. ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పనిచేసే వర్కర్లు రోజులో 10–12 గంటలు పని చేసి కూడా సరైన ఆదాయం, భద్రత, బెనిఫిట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది.

Read also: Varanasi: రాజమౌళి వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానరసేన ఆగ్రహం – పోలీసులకు ఫిర్యాదు

Good news for delivery boys! New bill approved..

‘అల్గారిథమ్ పారదర్శకత’

TG: ఈ బిల్లులో భాగంగా గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయబడుతుంది. రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ వంటి బాధ్యతలు ఈ బోర్డుకు ఉంటాయి. కంపెనీలు వర్కర్ల నుంచి వసూలు చేసే మొత్తం 1–2 శాతం ప్రత్యేక నిధికి వెళ్తుంది. చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా అనే విషయాన్ని రియల్-టైమ్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. వర్కర్లపై అన్యాయ నిర్ణయాలు, అకౌంట్ సస్పెన్షన్‌లను ఆపడానికి ‘అల్గారిథమ్ పారదర్శకత’ను కూడా బిల్లులో చేర్చారు.

2 లక్షల వరకు పెనాల్టీలు

నిబంధనలను పాటించని ప్లాట్‌ఫారమ్‌లకు జరిమానాలు విధించే అవకాశం కూడా చట్టం కల్పిస్తోంది. సంక్షేమ రుసుములు చెల్లించని సంస్థలకు మొదటి తప్పుకు రూ. 50,000, పునరావృతం అయితే రూ. 2 లక్షల వరకు పెనాల్టీలు ఉంటాయి. ఉద్యోగులను తొలగించే ముందు తప్పనిసరిగా ఏడు రోజుల నోటీసు ఇవ్వాలి. సమస్యలు పరిష్కరించుకోలేని వర్కర్లకు అప్పీలేట్ అథారిటీకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కర్నాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు చర్చించినా, అమలులోకి తీసుకురాలేకపోయాయి. కానీ ఈ విషయంలో ముందడుగు వేసేది తెలంగాణే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Delivery Jobs gig workers latest news Swiggy Telangana Telugu News Zomato

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.