తెలంగాణ (TG) ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పటం, పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ (‘Telangana Rising Global Summit’) కు రంగం సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ గ్లోబల్ సంబరాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు.
Read Also: Telangana Heritage: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు రెడీ
ఇవాళ, రేపు 27 అంశాలపై చర్చలు
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ (TG) లో ప్రజాపాలన పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, అలాగే భారత్ ఫ్యూచర్ సిటీపై వివరించనున్నారు. సీఎం ప్రసంగం అనంతరం.. సదస్సులో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నాలుగు సమావేశ మందిరాల్లో వేర్వేరు అంశాలపై చర్చాగోష్ఠులు జరుగుతాయి.
80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తికాగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా USA నుంచి 54 మంది హాజరుకానున్నారు. ఇవాళ, రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. 1,000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1,500 మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు.
ఈ రెండ్రోజుల సదస్సులో సుమారు రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. విద్య, నైపుణ్య, క్రీడా, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడుల కోసం టీసీఎస్-టీపీజీ, హ్యుందయ్, ఫుడ్ లింక్ వంటి పలు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపాయి. (రేపు) మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను ఆవిష్కరిస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: