📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Author Icon By Aanusha
Updated: February 10, 2026 • 11:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) రాష్ట్రంలో పురపాలక ఎన్నికల కోసం రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం (రేపు) 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Read Also: Phone Tapping Case : మంత్రి పొంగులేటి వార్నింగ్

ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది

మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

TG: Everything is ready for the municipal elections

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ కోసం 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఓటర్లు తమ ఓటర్ స్లిప్పులను ఎస్‌ఈసీ వెబ్‌సైట్ లేదా TE-POLL యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మొత్తం 2,981 వార్డులకు గాను 12,944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news MunicipalElections Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.