తెలంగాణలో కొత్త విద్యుత్ డిస్కం(TG Electricity Discom) ఏర్పాటు విషయంపై ప్రభుత్వం ఈ మధ్యాహ్నం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. 2026 జనవరి నుంచి అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.59,671 కోట్ల భారీ నష్టాల్లో ఉన్న TGSPDCL, TGNPDCL డిస్కం లపై సబ్సిడీ(subsidy) భారం తగ్గించేందుకు ఈ నూతన డిస్కం సహాయపడనుంది.
Read Also: Delhi Blast: ఢిల్లీ కారు బాంబుతో వాయిదాపడ్డ నెతన్యాహు భారత్ పర్యటన

వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఫ్రీ పవర్(units of free power), మిషన్ భగీరథ సరఫరా, హైదరాబాద్ వాటర్ బోర్డు వినియోగ విద్యుత్‌ను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావడం ప్రతిపాదనలో ఉంది. అదనంగా, ఇతర విద్యుత్ సంస్కరణలను కూడా క్యాబినెట్ భేటీలో పరిశీలించే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: