📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG Elections: స్థానిక ఎన్నికల్లో ఖర్చు లక్షల్లో.. వేతనాలు వేలల్లో..

Author Icon By Saritha
Updated: October 9, 2025 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు లక్ష్యల్లో

హైదరాబాద్ : సాధారణంగా ఎన్నికల్లో(TG Elections)స్థానిక ఎన్నికల్లో ఖర్చు లక్షల్లో.. వేతనాలు వేలల్లో.. ఖర్చు భారీగానే ఉంటుంది. అయితే వారికి వచ్చే నెలసరి వేతనం మాత్రం అంతంతమాత్రమే. ఉదాహరణకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు కోట్లలో ఉంటే వేతనాలు మాత్రం లక్ష్యల్లో ఉంటుంది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు లక్ష్యల్లో ఉంటే వేతనం మాత్రం వేలల్లోనే ఉంటుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు గౌరవ వేతనాల అంశం కీలకంగా మారింది. ప్రస్తుతం సర్పంచ్లు, ఎంపీటీసీలకు రూ.6,500, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు రూ.13,000 చొప్పున గౌరవ భత్యం అందుతోంది. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లకు వేతనం లేదు. ఎన్నికల సంఘం సర్పంచ్ (Sarpanch)అభ్యర్థులకు రూ.2.50 లక్షల వరకు ఖర్చు పరిమితిని నిర్ణయించింది. ఎన్నికల నియమావళి అమలుకు తహశీల్దార్లను నోడల్ అధికారులుగా నియమించారు. నిబంధనలు ఉల్లంఘించిన
అభ్యర్థులు మూడేళ్లు పోటీకి అనర్హులు అవుతారు.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో.. గౌరవ వేతనాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు,(ZPTC)ఎంపీపీలకు ప్రస్తుతం చెల్లిస్తున్న గౌరవ వేతనాలు 2021వ సంవత్సరంలో పెంచిన మొత్తాలే కొనసాగుతున్నాయి. 2021కు పూర్వం సర్పంచ్లకు రూ.5,000మాత్రమే చెల్లించగా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని రూ.1,500 పెంచి రూ.6,500 చేసింది. ఎంపీటీసీ సభ్యులకు కూడా రూ.6,500 చొప్పున గౌరవ భత్యం అందుతోంది. సర్పంచ్లు, ఎంపీటీసీలు నెలకు రూ.6,500 చొప్పున వేతనం పొందుతుండగా.. జడ్పీటీసీలు, ఎంపీపీలకు ప్రస్తుతం రూ.13,000 అందుతోంది. అత్యున్నత స్థానిక పదవిలో ఉన్న జెడ్సీపీ (జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్)కు రూ.1 లక్ష వరకు గౌరవ వేతనం లభిస్తుంది.

Read also: దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై రైల్వే గార్డులు..

సర్పంచ్ అభ్యర్థులకు రూ.2.50 లక్షల ఖర్చు పరిమితి:

అయితే. గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు(TG Elections)స్థానిక ఎన్నికల్లో ఖర్చు లక్షల్లో.. వేతనాలు వేలల్లో.. సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలవగా.. అక్టోబర్ 9 నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారం భం కానుంది. రేపే స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ రేపు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ స్థానిక ఎన్నికల ఖర్చు పరిమితి రూ.2.50 లక్షల వరకు సర్పంచ్ ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఖరారు చేసింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే.. అభ్యర్థులు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. అంతేకాకుండా.. గెలిచినా కూడా వదవిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం.. 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడుగా పోటీ చేసే వ్యక్తి రూ.50 వేలలోపు ఖర్చు చేయాలి. జెడ్పీటీసీ అభ్యర్థికి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థికి రూ.1.50 లక్షల వ్యయ పరిమితి ఉంది. అభ్యర్థుల తరఫున రాజకీయ పక్షాలు చేసే ఖర్చులు కూడా అభ్యర్థి ఖాతాకే జమ అవుతాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి 45 రోజులలోపు ఖర్చుల తుది నివేదికను సంబంధిత అధికారికి సమర్పించాలి. ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే రూ.325 కోట్ల నిధులను విడుదల చేసింది. తహశీల్దార్లను నోడల్ అధికారులుగా నియమించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Election expenses Local elections mptc panchayat elections Telangana Elections Telangana news zptc

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.