తెలంగాణ గ్రామ పంచాయతీ (TG Elections)ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20వ తేదీన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రమాణస్వీకార కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
ఈ కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శుల(TG Elections) పర్యవేక్షణలో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సంచాలకురాలు సృజన జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొదటి సమావేశంలో ఎన్నికైన ప్రతినిధులు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, అనంతరం ప్రమాణపత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.
మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
రాష్ట్రంలో ఈ నెల 11న తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో దశ ఎన్నికలు నేడు (డిసెంబర్ 14న) జరగనుండగా, మూడో దశ ఎన్నికలు డిసెంబర్ 17న నిర్వహించనున్నారు. అన్ని దశల ఎన్నికలు ముగిసిన అనంతరం డిసెంబర్ 20న కొత్త పాలకవర్గాలు అధికారంలోకి రానున్నాయి.
నేడు జరగనున్న రెండో దశ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీల్లో పోలింగ్(Polling) నిర్వహించనున్నారు. మొత్తం 3,911 సర్పంచి స్థానాలు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
లక్షలాది ఓటర్లు, వేలాది సిబ్బంది ఎన్నికల విధుల్లో
ఈ ఎన్నికల్లో 12,782 మంది సర్పంచి అభ్యర్థులు, 71,071 మంది వార్డు సభ్య అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఎన్నికల నిర్వహణ కోసం 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. అదనంగా 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి పారదర్శకతను పెంచారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం కౌంటింగ్ చేపట్టనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: