TG EdCET 2026: షెడ్యూల్ విడుదల: మే 12న ఎంట్రన్స్ పరీక్ష

Read Time:  1 min
TG EdCET 2026
TG EdCET 2026
FONT SIZE
GET APP

TG EdCET 2026: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే TG EdCET 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను కేయూ వైస్ చాన్సలర్, ఎడ్‌సెట్ చైర్మన్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

Read Also: Telangana Inter Exams: ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

TG EdCET 2026
TG EdCET 2026: Schedule released: Entrance exam on May 12

అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్యంగా దరఖాస్తు చేయాలనుకునే వారికి అదనపు ఫీజుతో అవకాశం ఉంది. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు అప్లికేషన్ చేయవచ్చు.

ఈ ఎంట్రన్స్ పరీక్షను మే 12న రెండు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. ఫలితాలను మే 30న విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.