📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

TG EAPCET: ఎప్ సెట్లో 77,561 సీట్లు భర్తీ5493 సీట్లు ఖాళీ

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

31 నుంచి ఆగస్టు 2 లోపు కాలేజీల్లో చేరాలి

సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఇంజనీరింగ్ తోపాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్-2025 కౌన్సెలింగ్లో మొదటి విడత సీట్ల కేటాయింపులో 77,561 మందికి సీట్లను కేటాయిం చారు. మరో 5493సీట్లు ఖాళీగాఉన్నట్టు సాంకేతిక విద్య శాఖ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎప్సెట్ కౌన్సెలింగ్లో (EAPCET Counselling) భాగంగా మొదటిసారిగా ప్రారంభించిన మాక్ సీట్ అలకేషన్ను ఈ నెల 12న శనివారం ప్రకటించారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 77,154 మందికి సీట్ల కేటాయింపు చేశారు. మాక్ సీట్ అలకేషన్లో సీటు పొందిన వారు తమ వెబ్ ఆప్షన్లను మార్చుకోవడానికి ఈ నెల 15 వరకు అవకాశం కల్పించగా, మాక్సిట్ అలకే షన్లో భాగంగా సీటు పొందిన వారిలో 44,553 మంది తమ వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకున్నారు.

మొదటి విడతలో

దీంతో మొదటి విడత సీట్ల కేటాయింపు శుక్రవారం చేశారు. ఎపి సెట్ కౌన్సెలింగ్లో భాగంగా ఈనెల 7తోనే స్లాట్ బుక్ చేసుకునే గడువు ముగియడంతో గడువులోపుగా 97,533 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. వారికి ఈ నెల 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషనన్ను నిర్వహించగా 95,256 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు. వారిలో 94,354 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారు మొత్తం 56,63,308 వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. రాష్ట్రంలో 83,054 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండగా వాటిలో మొదటి విడతలో 77,561 సీట్లను కేటాయించారు. మరో 5493 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్ల కేటాయింపులో ఒక గవర్నమెంట్ కాలేజీ (Government College) లో 195 సీట్లు ఉండగా, 94 సీట్లను(48.20శాతం) కేటాయించారు. 20 యూనివర్సిటీ కాలేజీల్లో 6108 సీట్లు అందుబాటులో ఉండగావాటిలో 5151 సీట్లను(84.30శాతం) కేటాయించారు. 2 ప్రైవేటు యూనివర్సిటీల్లో 1367 సీట్లు ఉంటే వాటిలో 1357 సీట్లను (99.20శాతం) కేటాయించారు. 149 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 75,384 సీట్లు అందుబాటులో ఉండగా 70,959 సీట్లను(94.10శాతం) కేటాయించారు.

కౌన్సెలింగ్ ప్రక్రియ

మొత్తం 172 కాలేజీల్లో 83,054 సీట్లు అందుబాటులో ఉంటే వాటిలో 77,561 సీట్లను (93.30శాతం) కేటాయించారు. మరో 5493 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 16,793 మందికి సీట్లు కేటాయించ లేదని అధికారులు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 6083 మందికి సీట్లను కేటాయించారు. 82 కాలేజీల్లో 100 శాతం సీట్లను కేటాయించారు. వాటిలో 6 యూనివర్సిటీ కాలేజీలు ఉండగా 76 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. జూన్ 28 నుంచే ఎప్ సెట్-2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగింది. మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థులు నేటి(జులై18) నుంచి 22 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని శ్రీదేవసేన తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 31 నుంచి ఆగస్టు 2 వరకు ఆయా కాలేజీల్లో నేరుగా చేరాల్సి ఉంటుందని ప్రకటించారు.

TG EAPCET: ఎప్ సెట్లో 77,561 సీట్లు భర్తీ5493 సీట్లు ఖాళీ

బ్రాంచ్ వారీగా సీట్లను పరిశీలిస్తే..

రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచ్ల్లో కలిపి కన్వీనర్ కోటాలో 80, 054 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటి సీట్లు 58,742 సీట్లు ఉంటే వాటిలో మొదటి విడతలో 57,042 సీట్లను కేటాయించారు. మరో 1700 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మొత్తం సీట్లలో 97.11 శాతం సీట్లు కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 16,112 సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో 14,054 సీట్లను కేటాయించారు. మరో 2058 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం సీట్లలో 87.23 శాతం సీట్లను మొదటి విడతలోనే కేటాయించారు. కోర్ ఇంజనీరింగ్ కోర్సులైన సివిల్ అండ్ మెకానికల్ సీట్లకి సంబంధించి 7100 సీట్లు అందుబాటులో ఉంటే, అందులో 5632 సీట్లను మొదటి విడతలో కేటాయించగా.. మరో 1468 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం సీట్లలో 79.32 శాతం సీట్లను కేటాయించారు. ఇతర ఇంజనీరింగ్ కోర్సుల (engineering courses) కి సంబంధించి 1100 సీట్లు అందుబాటులో ఉంటే వాటిలో 833 సీట్లను కేటాయించగా ఇంకా 267 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం సీట్లలో 93.39 శాతం సీట్లను కేటాయించారు. మొత్తం కన్వీనర్ కోటాలో 83,054 సీట్లకు గానూ 77,561 సీట్లను(93.39 శాతం) మొదటి విడతలోనే కేటాయించారు.

కేటగిరీ వారీగా సీట్ల కేటాయింపు..

ఓసీలో 8020 మంది బాలురు, 7450 మంది బాలికలకి సీట్లను కేటాయించారు. బిసి-ఏలో 3096 మంది బాలురు, 2768 బాలికలు, బిసి-బిలో 8301 మంది బాలురు, 7596 మంది బాలికలు, బిసి-సిలో 226 మంది బాలురు, 140 మంది బాలికలు, బిసి-డిలో 7002 మంది బాలురు, 6476 మంది బాలికలు, బిసి-ఈలో 3811 మంది బాలురు, 1671 మంది బాలికలు ఉన్నారు. ఎస్సీ-1లో 250 మంది బాలురు, 144 మంది బాలికలు, ఎస్సీ-2లో 4035 మంది బాలురు, 3807 మంది బాలికలు, ఎస్సీ-3లో 2482 మంది బాలురు, 2365 మంది బాలికలు, ఎస్టీలో 4701 మంది బాలురు ఉండగా, 3220 మంది బాలికలు ఉన్నారు.

EAPCET TG అంటే ఏమిటి?

EAPCET TG అంటే తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడే ప్రవేశ పరీక్ష.

తెలంగాణ EAPCET (TG EAPCET) రాయడానికి అర్హతలు ఏంటి?

అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (10+2 ప్యాటర్న్) పరీక్షను పూర్తి చేసి ఉండాలి లేదా ఫైనల్ ఇయర్ పరీక్ష రాసి ఉండాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rammohan Reddy: రైతుల పట్ల వివక్షత చూపిస్తే సహించం

agriculture courses Telangana Breaking News engineering admissions Telangana latest news pharmacy admissions TG Telangana EAPCET counselling TG EAPCET 2025 TG EAPCET seat allotment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.