📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

TG: మంచు ప్రభావం.. స్కూల్స్ టైమింగ్స్ మార్పు

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో(TG)దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్‌ టెంపరేచర్స్‌ నమోదవుతున్నాయి. పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. లైట్స్‌ వేసుకుని వెళ్తున్నా.. రహదారి కనిపించనంత స్థాయిలో పొగమంచు కమ్మేస్తోంది. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో, పాఠశాలల కు వచ్చే విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఆదిలాబాద్‌ జిల్లాలో పాఠశాలల టైమింగ్స్‌ మారాయి. జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల సమయాల్లో మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: HYD: తెలంగాణలో కొత్త హైకోర్టు

TG Due to the effect of fog, school timings have been changed.

చలి కారణంగా పాఠశాల సమయాలు సవరింపు

జిల్లా(TG) వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు(Temperatures) గణనీయంగా తగ్గిన నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాల సమయాలను సవరించి, ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగేలా నిర్ణయించారు.ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్లకు వర్తిస్తాయని పేర్కొన్నారు.

అన్ని మండల విద్యా శాఖ అధికారులకు, ప్రభుత్వ, ఎల్బీ, కేఏజీబీవీ, మోడల్ హై స్కూళ్లు, అలాగే ప్రైవేటు విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మార్గదర్శకాలను పాటించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, పాఠశాల సమయాల మార్పుల అమలును విద్యాశాఖ పర్యవేక్షించనుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇదే విధంగా చలి తీవ్రత ఎక్కవ ఉన్న మిగిలిన ప్రాంతాల్లో వెసులు బాటు కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు. తెలంగాణలో దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్‌ టెంపరే చర్స్‌ నమోదవుతున్నాయి. వచ్చే 3 రోజులు భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Afternoon Classes Cold wave Collector Orders Morning Classes School Timings Student Safety Telangana temperature drop Weather Alert

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.