📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG DGP Jitender: పోలీసులందరూ పట్టభద్రులు కావాల్సిందే

Author Icon By Anusha
Updated: August 15, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, తెలంగాణ పోలీస్ ఎంఒయు కార్యక్రమంలో డిజిపి జితేందర్

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసుందరికీ కనీస విద్యార్హత ఉండాలని నిర్ణయించినట్లు డిజిపి జితేందర్ (DGP Jitender) అన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ డిజిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంఒయు కార్యక్రమంలో తొలి సారిగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలంగాణ పోలీస్ ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పది, ఇంటర్ విద్యనభ్యసించి పోలీస్ శాఖలో ఉద్యో గులుగా చేరారని గుర్తు చేశారు. అయితే వీరందరికీ గ్రాడ్యుయేషన్ చేయించాలనే ఉద్దేశంతో రాజీ కుదుర్చుకున్నట్లు తెలి పారు. డిపార్ట్ మెంట్ లో దాదాపు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లు (Head Constables) సహా 30 వేల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేయని వారు ఉన్నట్లు తాము గుర్తించామని, వచ్చే ఐదేళ్లలో పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ గ్రాడ్యు యేషన్ చేసిన వారిగా ఉండాలని తమ సంకల్పమని జితేందర్ స్పష్టం చేశారు.

TG DGP Jitender

దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలకంటే

ఇక అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలకంటే మనం ఉత్తమ స్థానంలో ఉన్నా మని చెప్పారు. పోలీస్ శాఖలో ప్రస్తుతం వివిధ విభాగాల్లో, పలు పోస్టుల్లో పనిచేస్తున్న వారిలో కొందరికి డిగ్రీ అర్హత లేదని తెలిపారు. పలు కారణాలతో డిగ్రీ చేయకపోవడం, మధ్యలోనే ఆపేసిన వాళ్లు సైతం ఉన్నారని వివరించారు. అలాంటి వారికి తమ యూనివర్సిటీ ద్వారా ఓపెన్ డిగ్రీ చేసే అవకాశం కల్పి స్తున్నామన్నారు. అంతే కాకుండా వీళ్లకు అదనంగా పోలీసింగ్ కి కావాల్సిన శిక్షణ సైతం అందిస్తామని తెలిపారు. ఒకవైపు విధులు నిర్వ హిస్తూనే.. మరోవైపు చదువుకునే వెసులుబాటు కల్పించనున్నామని తెలిపారు. పోలీస్ ఆధ్వర్యంలోని ట్రైనింగ్ సెంటర్లను పోలీస్ అభ్యర్థుల కోసం వినియోగించుకోనున్నట్లు విసి ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.

ఆయన విద్యా, వృత్తి నేపథ్యం ఏమిటి?

డిజిపి జితేంద్ర ఐ.పి.ఎస్ (Indian Police Service) అధికారిగా ఎంపిక అయ్యారు, అనుభవజ్ఞుడైన పోలీస్ అధికారి.

ఆయన ప్రధాన బాధ్యతలు ఏమిటి?

రాష్ట్రంలో శాంతి, సురక్షా నిర్వహణ, నేర రహిత Telangana కోసం పోలీస్ కార్యక్రమాల సమన్వయం, నూతన పోలీస్ విధానాల అమలు, మరియు అత్యవసర పరిస్థితుల్లో చర్యలు చేపట్టడం.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telangana-government-working-to-increase-the-market-value-of-land/telangana/530450/

Breaking News DGP Jitender latest news Minimum educational qualification Police eligibility criteria police recruitment Telangana law enforcement telangana police Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.