📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: kondagattu: కొండగట్టు అంజన్న ఆలయంలో విద్యుదాఘాతంతో భక్తురాలు మృతి

Author Icon By Rajitha
Updated: October 17, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG: మల్యాల, (జగిత్యాల జిల్లా) : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి (kondagattu) ఆలయానికి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. నిర్లక్ష్యమేనని అధికారుల నిరక్ష ఈ ఘటనకు కారణమని మృతురాలి కుటుంబీకులు మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరిఖనికి చెందిన వెనగంటి సత్యనారాయణ(54) తన తల్లి రాజేశ్వరి(84), భార్య సరిత కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం వేములవాడలో దర్శనం చేసుకుని గురువారం ఉదయం 6:30కు కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకున్నారు. 7 గంటల ప్రాంతంలో రాజేశ్వరి, కోడలు సరిత కలిసి కొండపైన కోనేరు పక్కనే ఉన్న టాయిలెట్స్ కు దగ్గరికి వెళ్లారు. మరుగుదొడ్ల గోడకు అనుకొని ఉన్న ఇనుపజాలిని ముట్టుకోగానే రాజేశ్వరితోపాటు సరితకు కరెంట్ షాక్ తగిలింది. దాంతో రాజేశ్వరి స్పృహతప్పి పడిపోయింది.

Read Also: Konda Surekha : పార్టీ పెద్దలే చూసుకుంటారు – కొండా సురేఖ

TG

అయితే సరితకు కొద్దిగా షాక్ రాగానే వారిని గమనించిన కుటుంబీకులు వారిద్దరిని జగిత్యాల (jagtial) ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే రాజేశ్వరి చనిపోయిందని వెల్లడించారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయంలో భద్రత కరువైందని, ఇటువంటి దుర్ఘటన జరగడం పట్ల ఆలయ అధికారుల నిర్లక్ష్యమేనని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అక్కడ ప్రమాదకరమని బోర్డులు సైతం అమర్చకపోవడం, అన్నిటికి మించి విద్యుత్ లైన్లపై పర్యవేక్షణ పట్ల నిర్లక్ష్యoగా వ్యవహరించడం పై స్థానికులతోపాటు భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొండగట్టులో తన తల్లి రాజేశ్వరి కరెంటుషాక్తోతో చనిపోవడానికి ఆలయ ఇఒతో పాటు సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి పెద్ద కొడుకు సత్యనారాయణ ఫిర్యాదు చేశాడని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఏమి జరిగింది?
విద్యుదాఘాతంతో భక్తురాలు రాజేశ్వరి మృతి చెందింది.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయంలో

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Anjaneya Swamy Devotee Death electric shock Kondagattu Temple latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.