📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG Degree New Courses: బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

Author Icon By Saritha
Updated: March 10, 2026 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు

TG Degree New Courses: బిఎలో ఢిపెన్స్ కోర్సులను ప్రారంభించనున్నారు. దాంతోపాటు డిగ్రీలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి 10 కొత్త కోర్సులను ప్రారంభించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. రానున్న విద్యా సంవత్సరం 2026-27లో డిగ్రీతోపాటు పీజీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. డిగ్రీలో కొన్ని.. పీజీలో కొన్ని కొత్త కోర్సులను ప్రారంభించనున్నారు.

Read Also: Urea Stock: ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు

TG Degree New Courses: Defense in BA.. 10 more new courses

డిగ్రీ, పీజీలో కొత్త కోర్సులు

డిగ్రీలో కొత్త కోర్సులుగా బీఏలో డిఫెన్స్, సెక్యూరిటీ, పొలిటికల్ సైన్స్ను ప్రారంభించనున్నారు. బీకాంలో 4 కోర్సులను ప్రారంభించనున్నారు. ఫిన్దెక్- బిజినెస్ ఇంటెలి జెన్స్ అండ్ ఎనలిటిక్స్, ఇంటర్నేషనల్ బ్యాంకిం గ్, ఫైనాన్స్, ఎకౌంట్స్, డిజిటల్ మార్కెటింగ్, బీబీఏలో 3 కోర్సులు ప్రారంభిస్తారు. ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్, ఏరోస్పేస్ మేనేజ్ మెంట్, ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్ మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్స్ను ప్రారంభించనున్నారు. బీఎస్సీలో మల్టీ మీడియా డిజైన్ అండ్ యానిమేషన్తో పాటు వుడ్ సెక్యూరిటీ, ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ రెండు కోర్సులను ప్రారంభించనున్నారు. పీజీలో… ఎంఏ ఏవియేషన్ మేనేజ్మెంట్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ రెండు కోర్సులను ప్రారంభించనున్నారు.

దరఖాస్తు గడువు పొడిగింపు

కొత్తగా ప్రారంభించనున్న కోర్సులను ప్రారంభించడం కోసం ప్రైవేటు కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేయగా.. దరఖాస్తులకు నేడు (మార్చి 10-మంగళవారం) తుది గడువుగా ప్రకటించింది. దరఖాస్తులకు నేడు తుది గడువు ఉండగా.. దానిని కాస్త ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. వరకు స్వీకరించనుంది. కొత్తగా బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలెటిక్స్ కోర్సు రాబోతు న్నది. వ్యాపార డాటాను సేకరించడం, ప్రాసెస్ చేయడం, విశ్లేషించడం ఈ కోర్సు ప్రత్యేకత.. జాతీయంగా బిజినెస్ డాటా సైంటిస్ట్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త కోర్సును రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ కోర్సులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా చేరవచ్చు.

ప్రవేశ అర్హతలు

రూరల్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఎసీ వంటి ఏ కోర్సు పూర్తిచేసిన వారైనప్పటికీ ఈ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్తగా బీబీఏ మేనేజ్మెంట్ కోర్సును సైతం ప్రవేశపెట్టనున్నది. 10 కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో 8 కోర్సుల్లో ఇంటర్లో ఏ కోర్సు చదివిన విద్యా ర్థులైనా చేరవచ్చు. కేవలం బీఎస్సీ మల్టీమీడియా డిజైన్ అండ్ యానిమేషన్, బీఎస్సీ ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ కోర్సుల్లో మాత్రమే.. ఇంటర్లో సైన్స్ గ్రూప్ చేసిన విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BA Defense Business Intelligence Course Latest News in Telugu New Degree Courses Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.