📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

TG: అడవిపంది రూపంలో మృత్యువు ఇద్దరు యువకులు మృతి

Author Icon By Saritha
Updated: January 3, 2026 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నూతన సంవత్సరం సందర్భంగా బిర్యానీ తినేందుకు వెళ్లిన స్నేహితుల ప్రయాణాన్ని అడవిపంది రూపంలో మృత్యువు వెంటాడింది. (TG) కారుకు అడ్డంగా అడవిపంది రావడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో వాహనం బోల్తా కొట్టగా, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహేశ్వరం ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, మహేశ్వరం మండల పరిధిలోని పోరండ్ల గ్రామానికి చెందిన గిరి, శ్రీకాంత్, శివ స్నేహితులు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం రాత్రి బిర్యానీ తినేందుకు స్వగ్రామం పోరండ్ల నుంచి మహేశ్వరం మండల కేంద్రానికి కారులో వెళ్లారు. బిర్యానీ తిన్న అనంతరం తిరిగి పోరండ్లకు బయలుదేరారు.

Read also: Maoist: తెలంగాణ డీజీపీ ఎదుట నేడు లొంగిపోనున్న బరిసె దేవా

Death in the form of a wild boar two young men die.

తీవ్రంగా గాయపడిన మరో యువకుడు

ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ కారులో వెళ్తున్న క్రమంలో (TG) ఆక్సాన్‌పల్లి గేటు సమీపానికి చేరుకోగానే ఒక అడవిపంది రోడ్డు పైకి  ఒక్కసారిగా దూసుకు వచ్చింది. అందోళనతో  దానిని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గిరి (29), శ్రీకాంత్‌ (27)లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన శివను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) కి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


car accident Latest News in Telugu Maheshwaram new year Road Accident Sangareddy District Telangana news Telugu News Wild Boar Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.