భూపాలపల్లి కోర్టు సంచలన తీర్పు
కాటారం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లా(TG Crime) కాటారం మండలం గంగారం గ్రామంలో భూతగాదాల కక్ష్యలో ముగ్గురిని దారుణంగా నరికి చంపిన తొమ్మిది మంది ముద్దాయిలు అయిన లావుడ్య మహంకాళి నాయక్, లావుడ్య భాస్కర్, లావుడ్య సర్దార్, లావుడ్య బాపు నాయక్, లావుడ్య కౌసల్య, లావుడ్య సారయ్య, లావుడ్య బాపు నాయక్, లావుడ్య సమ్మయ్య, అజ్మీర రాజ్ కుమార్ లకు జీవిత ఖైదు విదిస్తూ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు. కేసు యొక్క పూర్వోపరాల ప్రకారం.. కాటారం మండలం గంగారం గ్రామములో లావుడ్య మాంజ్యా నాయక్ అనతనికి సర్వే నెంబర్ 365లో 20 ఎకరముల వ్యవసాయ భూమి ఉంది. ఇట్టి భూమి విషయములో మాంజ్యా నాయక్, అతని తమ్ముని కొడుకులకు గత కొన్ని సంవత్సరాలుగా తగాదాలు నడుస్తున్నాయి. ఇరువర్గాల వారు మంథని కోర్టును ఆశ్రయించగా కోర్టు మాంజ్యా నాయక్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
Read also: Minister Satyakumar: ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే అవకాశం
కోర్టు తీర్పుతో మరింత పెరిగిన కుటుంబాల మధ్య వైరం
అప్పటి (TG Crime) నుండి పగతో రగిలిపోయిన మాంజ్యానాయక్ తమ్ముని కొడుకు లావుడ్యా మహంకాళి నాయక్, మాంజ్యా నాయక్ అతని కుటుంబ సభ్యులను చంపి భూమి కాజేయాలనే దుర్బుద్దితో పథకం ప్రకారం తేదీ 19.06.2021 రోజున మాంజ్యా నాయక్ అతని కొడుకులు లావుడ్య సమ్మయ్య, లావుడ్య భాస్కర్ భాస్కర్ భార్య సునిత వారి కొడుకు సాయి పల్లున కలిసి వారి వ్యవసాయ భూమిలో పనులు చేసుకొంటుండగా ఉదయం 11 గంటల సమయంలో పథకం ప్రకారం లావుడ్య మహంకాళి నాయక్ అతని ముగ్గురు కొడుకులు లావుడ్య భాస్కర్, లావుడ్య సర్జన్ అలియాస్ సర్దార్, లావుడ్య బాపు నాయక్ ఇంకా కొంతమందితో గొడ్డండ్లు, కర్రలు, కారంపొడితో వచ్చి పొలం పనులు చేస్తున్న మాంజ్యా నాయక్, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసి కళ్లల్లో కారంచల్లి గొడ్డండ్లతో నరకగా, తీవ్రమైన గాయాలతో మాంజ్యానాయక్ అతని కొడుకులు సారయ్య, భాస్కర్లు అక్కడికక్కడే చనిపోయారు. మాంజ్యానాయక్ పెద్ద కొడుకు సమ్మయ్య, భాస్కర్ భార్య సునీతలకు తీవ్ర గాయాలు అయి అక్కడి నుండి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.
కేసు దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులకు అభినందనలు
ఇట్టి కేసులో ప్రత్యక్ష సాక్షి గాయపడిన మృతుడు లావుడ్య మాంజ్యా నాయక్ పెద్ద కొడుకు లావుడ్య సమ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కాటారం ఎస్సై సాంబమూర్తి, హత్యలో పాల్గొన్న 9 మందిపై హత్యకేసు నమోదు చేశారు. తదుపరి ఇట్టి కేసులో అప్పటి కాటారం డిఎస్పీ బోనాల కిషన్ దర్యాప్తు ప్రారంభించి నిందితులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తదుపరి పక్కా సాక్ష్యాధారాలలో తొమ్మిది మందిపై కోర్టులో చార్జీషీట్ ఫైల్ చేశారు. కోర్టులో విచారణ సమయంలో లైజన్ ఆఫీసర్ గాండ్ల వెంకన్న ఆధ్వర్యంలో సిడిఓ కె. రమేష్ కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ పగడ్బందిగా వాదనలు వినిపించారు. నిందితులపై నేరం రుజువు అయినందున న్యాయమూర్తి పై శిక్షను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఇట్టి కేసులో నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు చేసిన అధికారులను, కేసు విచారణ సమయంలో ప్రత్యేకంగా పర్యవేక్షించిన ప్రస్తుత కాటారం డిఎస్పీ ఎ. సూర్యనారాయణ, ప్రస్తుత కాటారం సిఐ ఈ. నాగార్జునరావు, ప్రస్తుత కాటారం ఎస్సై ఏకుల శ్రీనివాస్లను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: