గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ (TG Crime) నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు విడిచారు.. హైదరాబాద్ నిమ్స్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించారు. గత నెల జనవరి 23న ఇద్దరు స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సౌమ్యను కారుతో ఢీకొట్టారు. రివర్స్ తీస్తూ మరోసారి కారును ఆమెపై నుంచి తీసుకెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ఒక కిడ్నీ తొలగించారు.
Read Also: Ganja Batch Attack : మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
సౌమ్య మృతిపై తెలంగాణ (TG Crime) జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందని పేర్కొంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె సంతాపం తెలిపారు.. సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: