TG Crime: మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

Read Time:  1 min
TG Crime: మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య
FONT SIZE
GET APP

(TG Crime) హైదరాబాద్‌ సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుత్బుల్లాపూర్‌ సాయిబాబా నగర్‌లో నివాసముంటున్న బత్తిని అనిత (29) అనే యువతి శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, పరిసర ప్రాంత వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read Also: Pakistan: ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

TG Crime: Female physiotherapist commits suicide
TG Crime: Female physiotherapist commits suicide

కేసు నమోదు

అనిత, మల్లారెడ్డి హాస్పిటల్‎లో ఫిజియోథెరపి డాక్టర్‎గా పని చేస్తోంది. అయితే శనివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.