📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: TG Crime: కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. మనస్థాపంతో తండ్రి ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: November 21, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(TG Crime) తన కూతురు ఇతర కులం వ్యక్తిని ప్రేమించిందని.. తీవ్ర మనస్తాపం చెందిన తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar District) నవాబ్‌పేట మండలం హన్మసానిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  హన్మసానిపల్లి గ్రామానికి చెందిన కౌల్ల ఎల్లయ్య, అరుణ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Read Also: TG Weather: వణికిస్తోన్న చలి.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

సంఘటన వివరాలు

వీరికి ఇద్దరు కుమారులు, ఒక్కగానొక్క కూతురు సంతానం. కూతురు గౌతమి ఇంటర్మీడియట్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 19న ఉదయం ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం తల్లితండ్రులు బంధువుల ఇళ్లలో వెతుకుతున్నారు. ఈ క్రమంలో నవాబ్ పేట మండల కేంద్రంలో కొండాపూర్ గ్రామానికి (Kondapur village) చెందిన చందు అనే అబ్బాయితో గౌతమి తారసపడింది.

వెంటనే కూతురు దగ్గరికి వెళ్లి నచ్చ చెప్పి ఇంటికి తీసుకొని వచ్చారు.  అలా చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్లావని అడిగారు. తాను చందును ప్రేమించాను అని… తననే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకే అతనితో వెళ్లిపోయానని తల్లిదండ్రులకు తెలిపింది. ఇక కూతురి కులాంతర ప్రేమ పట్ల తండ్రి ఎల్లయ్య తీవ్ర మనస్థాపం చెందాడు.

TG Crime: Father commits suicide due to grief over daughter’s inter-caste marriage

పోలీసులకు ఫిర్యాదు

అదే రోజు రాత్రి ఎల్లయ్య ఊర్లోకి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రంతా కుటుంబ సభ్యులు ఎదురుచూసినా ఎల్లయ్య ఇంటికి రాలేదు. దీంతో మరునాడు ఉదయం ఎల్లయ్య కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. బంధువులు, స్నేహితులను ఆరా తీసారు. ఇక ఎల్లయ్య ఆచూకీ కోసం వెతుకుతూ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు.

అక్కడ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై ఎల్లయ్య భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతురు ఇతర సామాజిక వర్గం అబ్బాయిని ప్రేమించిందని మనస్థాపంతో తండ్రి ఎల్లయ్య మరణం గ్రామస్థులను కలచివేసింది. రోజు వ్యవసాయ పనులు చేసుకుంటూ కలివిడిగా ఉండే వ్యక్తి ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Mahabubnagar Incident Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.