📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Telugu News: TG Crime: రోడ్డు ప్రమాదంలో  నవవధువు మృతి.. వరుడి పరిస్థితి సీరియస్

Author Icon By Sushmitha
Updated: October 30, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నల్గొండ: ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న ఓ నవ దంపతుల జీవితాన్ని కాలం కబళించింది. పెళ్లైన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదం(road accident) రూపంలో మృత్యువు ఆ యువతిని కబళించగా, యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

Read also : US work permit : అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు – భారతీయులకు షాక్

ప్రేమ వివాహం, ప్రమాదం

నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండలం, చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్‌, నాంపల్లి మండలం, దామెర గ్రామానికి చెందిన అనూష (22) ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో 14 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసుల కౌన్సెలింగ్‌తో పెద్దలు సమ్మతించి, మూడు రోజుల క్రితం గుడిలో వారి వివాహాన్ని తిరిగి నిర్వహించారు. పెళ్లి అనంతరం నవీన్ తన భార్య అనూషతో కలిసి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గుర్రంపోడు గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో గుర్రంపోడు సమీపంలోని వంతెన మీదకు వచ్చేసరికి వీరి ద్విచక్ర వాహనం మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

భర్త కోసం భార్య ఆత్మహత్యాయత్నం

ఈ ఘటనలో నవీన్ కిందపడి తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లగా, భార్య అనూష అమాంతం వంతెన గోడపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడిపోయింది. నీటిలో మునిగిపోయిన అనూషను స్థానికులు సుమారు 20 నిమిషాల పాటు వెతికి ఒడ్డుకు చేర్చారు. అనూషతో పాటు నవీన్‌ను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అనూష మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉంది. నర్సింగ్ పూర్తి చేసిన అనూష త్వరలోనే ఉద్యోగంలో చేరాలనుకుంది.

కుటుంబాల్లో విషాదం

అందరినీ ఎదిరించి పెళ్లిచేసుకోవడం, పెద్దలను ఒప్పించి మరోసారి ఒకటైన ఆ దంపతుల ఆశలు అడియాసలు కావడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కాళ్ల పారాణి ఆరక ముందే నవవధువు మృతి చెందడం, యువకుడు ప్రాణాలతో పోరాడుతుండటం అందరినీ కలిచివేసింది.

ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది?

నల్గొండ జిల్లా, గుర్రంపోడు సమీపంలోని వంతెన వద్ద జరిగింది.

నవ వధువు అనూష ఎలా మరణించింది?

రోడ్డు ప్రమాదం తర్వాత ద్విచక్ర వాహనం నుంచి వాగులో పడిపోవడం వల్ల మరణించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read also :

Couple Death Google News in Telugu Latest News in Telugu marriage tragedy. Nalgonda accident road crash Telugu News Today tragic love story

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.