📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

Author Icon By Aanusha
Updated: January 14, 2026 • 9:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్రాంతి పండుగ రద్దీనేపథ్యంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TG Crime) హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన సంభవించింది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో,

Read Also: Telangana: సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

గాయపడిన వారందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

వెనుక నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి డీసీఎంను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ స్టీరింగ్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడగా, బస్సులోని ప్రయాణికుల్లో 27 మందికి పైగా గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు.

TG Crime: An RTC bus collided with a DCM van… several people injured

సమాచారం తెలిసిన వెంటనే జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.బి. రత్నం తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పండుగ వేళ కావడంతో బస్సులో మొత్తం 53 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అతివేగమే కారణమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jadcherla Mandal latest news Mahabubnagar District National Highway 44 RTC bus accident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.