టీజీసీపీజీఈటీ-2025 నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ వంటి ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీసీపీజీఈటీ-2025 (TG CPGET 2025) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను మధ్యాహ్నం 3.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. టీజీసీపీజీఈటీ-2025 (TG CPGET 2025) కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఒక అధికార ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన పేర్కొన్న ప్రకారం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ కుమార్ మొలుగరామ్ ఈ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ (Notification) ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, వీరనారి చాకలి ఐలమ్మ, జేఎన్టీయూ హెచ్ యు వంటి యూనివర్సిటీలు మరియు వాటికి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో అడ్మిషన్లు (Admission) చేపట్టనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు మాస్టర్స్ స్థాయి విద్యనభ్యసించేందుకు అవకాశాలు కలుగనున్నాయి. ముఖ్యంగా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల ద్వారా విద్యార్థులు ఒకేసారి డిగ్రీతో పాటు పీజీ కోర్సులు పూర్తిచేయగలుగుతారు.
డిగ్రీ కోర్సులకు ‘దోస్త్’ ద్వారా సీట్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతం
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (Degree Online Services) – తెలంగాణ (దోస్త్) ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసి 60,428 మందికి సీట్లు కేటాయించగా, 41,285 మంది విద్యార్థులు తగిన కాలేజీల్లో చేరారు. మిగిలిన విద్యార్థుల్లో చాలామంది మెరుగైన కళాశాల లేదా కోర్సు కోసం మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. దాదాపు 13,000 మందికి పైగా విద్యార్థులు మరోసారి తమ ఎంపికలను మార్చుకునేందుకు ప్రయత్నించారు. రెండో విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 33,409 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దశలో సీట్లు కేటాయింపు ఫలితాలను మధ్యాహ్నం 3.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఏపీపీఎస్సీ అటవిశాఖ పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణతో ప్రారంభమవుతుంది. అనంతరం ఆఫ్‌లైన్ పద్ధతిలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి నూతన సిలబస్‌ను ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు కార్యదర్శి రాజబాబు వెల్లడించారు. అటవీ శాఖలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
Read also: IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఉద్యోగుల బదిలీ