తెలంగాణ లో (TG) చివరి దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. (TG) సాయంత్రానికి సర్పంచ్ ఫలితాలు తేలనున్నాయి. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచులను ఎన్నుకుంటారు. మొత్తంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు పోలింగ్ పూర్తయింది. ఈ విడతలో సర్పంచ్ పదవులకు 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Read Also: TG: సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం వాయిదా
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: