📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG Council budget sessions: అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పాలన

Author Icon By Saritha
Updated: March 18, 2026 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG Council budget sessions: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాగా.. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లోనూ మొదటిరోజు చర్చ కొనసాగింది. అందులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. తీర్మానం ప్రవేశ పెట్టాలని కోరగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్టారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీర్మానాన్ని బలవరుస్తున్నట్టు తెలిపారు. దీంతో సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించాలని మహేష్ కుమార్ గౌడ్ను మండలి చైర్మన్ సూచించారు.

Read Also: TG Council budget sessions: మండలి బడ్జెట్ సమావేశాలు 6 రోజులు

TG Council budget sessions: Governance aimed at development and welfare

గ్యారంటీల అమలుపై మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగం

దీంతో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చర్చలో పాల్గొంటూ.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి దిశను చూపిందన్నారు. గవర్నర్ ప్రసంగం విపక్షాల వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజా పాలనకు అద్దం పట్టేలా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల దిశను స్పష్టంగా ఆ ప్రసంగం ప్రతిబింబించిందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5
గ్యారంటీలు అమలు జరిపామని.. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, రైతులు అభివృద్ధి, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గవర్నర్ వివరంగా చెప్పారన్నారు.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గవర్నర్ ప్రస్తావించడాన్ని ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలు గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా ఉన్నాయన్నారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సోనియమ్మ ఇస్తే గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసి మా చేతికి ఇచ్చిందన్నారు. సర్వశక్తులు కూడగట్టుకుని ఒక్కొకో ఇటుక పేరుస్తు రైజింగ్ తెలంగాణ వైపు అడుగులు వేయిస్తున్నారని, తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేయడానికి ముఖ్యమంత్రి నడుం బిగించారన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ఆయన అడుగులు వేయిస్తున్నారు. మా పోటీ చెన్నై, బెంగళూరు, ముంబయి కాదని.. టోక్యో, సింగపూర్, నూయార్క్ తో అని ఆ వైపు గా వరుగులు తీయిస్తున్నారన్నారు. హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించి తెలంగాణ పేరును విశ్వవ్యాప్తం చేశామన్నారు.

డ్రగ్స్ టెస్టుకు సిద్ధం.. కేసీఆర్ వస్తారా?: ఎమ్మెల్సీ సవాల్

పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగంలోని ప్రముఖులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి పెట్టుబడులను ఆకర్షించి, ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రభుత్వం కొత్త చరిత్రను సృష్టించిందన్నారు. ఇటీవల ఐయో ఏషియా 2026 అంతర్జాయతీ సదస్సు నిర్వహించి మరో రూ. 1700 కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చామన్నారు. పాం హౌస్ లో పట్టుబడింది మీ నాయకులు కాడా అని బిఆర్ఎస్ను నేతలను ప్రశ్నించారు?… డ్రగ్స్ టెస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని కెసిఆర్ కూడా డ్రగ్స్ టెస్ట్ కి రావాలని సవాల్ విసిరారు. ప్రజా ప్రతిందులందరూ డ్రగ్స్ టెస్ట్కి రావాలని, చట్టం అందరికీ సమానమేనని.. ఇందులో ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Governor Shiv Pratap Shukla Mahesh kumar Goud Telangana Budget Sessions 2026 telangana legislative council

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.