TG Council budget sessions: మండలి బడ్జెట్ సమావేశాలు 6 రోజులు

Read Time:  1 min
TG Council budget sessions: మండలి బడ్జెట్ సమావేశాలు 6 రోజులు
FONT SIZE
GET APP

TG Council budget sessions: ఈ నెల 16 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇటు శాసనసభ, అటు శాసనమండలి సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు. అనంతరం మంగళవారం నుంచి శాసనసభ, మండలి సమావేశాలు వేరు వేరుగా కొనసాగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ నెల 30 వరకు సమావేశాలను కొనసాగించాలని బీఏసీలో నిర్ణయించారు. అయితే ఈ నెల 30 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగినప్పటికీ శాసనమండలి మాత్రం కేవలం 6 రోజులు మాత్రమే పనిదినాలుగా ప్రకటించింది.

Read Also: Hanamkonda FireAccident : హనుమకొండలో అల్లుడి ఘాతుకానికి తండ్రీకూతుళ్లు బలి!

TG Council budget sessions: మండలి బడ్జెట్ సమావేశాలు 6 రోజులు
TG Council budget sessions: Council budget sessions for 6 days

సమావేశాల షెడ్యూల్

ఈ నెల 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు. అనంతరం ఈ నెల 19న ఉగాది పండుగ నేపథ్యంలో సెలవుదినంగా ప్రకటించారు. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. 21న రంజాన్ పండుగ ఉండటం, 22న ఆదివారం కావడంతో రెండు రోజులు సెలవులు ఉంటాయి. అనంతరం ఈ నెల 23న బడ్జెట్పై చర్చించనున్నారు. 24న బడ్జెట్పై ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ఆ తరువాత 25 నుంచి 29 వరకు సభకు సెలవులను ప్రకటించారు. ఈ నెల 30న ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదింప చేయడంతో బడ్జెట్ సమావేశాలను ముగించాలని బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.