📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్

Author Icon By Aanusha
Updated: February 8, 2026 • 8:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయంగా విభజించిందని (TG) సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు గతంలోనే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు నచ్చిన లక్కీ నంబర్ ఆధారంగా జిల్లాల ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం, ప్రజల అవసరాలు పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాల విభజన జరిగిందని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న కొన్ని జిల్లాల రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Read Also: TG: కిషన్ రెడ్డి KCRకు దత్తపుత్రుడు: CM రేవంత్

జిల్లాలపై ఆలోచన చేస్తాం

ఈ విషయంపై తాజాగా (TG) సీఎం రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‍లో ఇవాళ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏ జిల్లాను తొలగించదని అన్నారు. కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.

TG: CM Revanth’s key comments on district reorganization

జిల్లాల పునర్విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే కచ్చితంగా బహిరంగంగా ప్రజలకు చెప్పి, అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్షాల సూచన తీసుకున్న తర్వాతే జిల్లాలపై ఆలోచన చేస్తామని వెల్లడించారు. ఎవరి ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని అపోహాలు సృష్టించాలని ప్రయత్నాలు చేసినా.. భూపలపల్లి జిల్లా ఎక్కడికి పోదని ఇది తన హామీ అని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CM Revanth Reddy latest news Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.