తెలంగాణ (TG) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ (HKS) నిర్వహించనున్న తొలి కృత్రిమ మేధ (Artificial Intelligence) సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి అధికారిక ఆహ్వానం అందింది.
Read Also: Budget 2026: బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కేవి ఇవే.. !!
వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తానని రేవంత్‌రెడ్డి వారికి తెలిపారు
ఈ సదస్సు ఈ ఏడాది మార్చి నెలలో జరగనుండగా, భారతదేశం నుంచి ఈ ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందుకున్న ఏకైక నాయకుడిగా (TG) రేవంత్ రెడ్డి నిలవడం విశేషం.హెచ్‌కేఎస్ డీన్ జెరెమీ వీన్‌స్టయిన్‌తో కలిసి ఈ సదస్సును ప్రారంభించాలని నిర్వాహకురాలు రుక్సాండా రెనిటా, ఇతర సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరారు. అయితే ప్రత్యక్షంగా తాను పాల్గొనలేనని.. హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తానని రేవంత్‌రెడ్డి వారికి వెల్లడించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: