తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన హస్తం పార్టీ, పట్టణ ఎన్నికల్లోనూ అదే విజయాన్ని సాధించాలనుకుంటోంది. (TG) తాజాగా మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుండే సమీక్షా సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయగా అందులో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ జూమ్ మీటింగ్‌లో జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మీనాక్షి చౌదరి పాల్గొన్నారు.
Read Also: Medaram Jatara: తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో ట్రాఫిక్ కష్టాలు
(TG) మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుండే సమీక్షా సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్
(TG) మున్సిపల్ ఎన్నికల నివేదికను మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికలపై సీఎం మంత్రులకు కీలక సూచనలు చేశారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 90శాతం స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని టార్గెట్ నిర్దేశించారు. ఎక్కడా కూడా రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 3న నామినేషన్లకు తుది గడువు ఉండటంతో ఆ లోపు వారితో విత్‌డ్రాలు చేయించాలని ఆదేశించారు. ఎక్కడ కూడా రెబల్స్ పోటీలో ఉండొద్దని అలా ఉంటే పార్టీకి ప్రమాదమని హెచ్చరించారు. టికెట్లు రాని వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ అడంగా ఉంటుందని నాయకులకు తగిన ప్రతిఫలం దక్కుందని చెప్పారు.
తెలంగాణలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరననున్నాయి. ఫిబ్రవరి 13న కౌంటింగ్, ఫిభ్రవరి 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈ నెల 28న నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వగా జనవరి 30న ముగిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com