📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: TG: రూ. 5 లక్షల కోట్ల భూకుంభకోణానికి సిఎం రేవంత్ కుట్ర: కెటిఆర్

Author Icon By Saritha
Updated: November 22, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : కాంగ్రెస్(Congress) ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టిపి) పేరిట సిఎం రేవంత్ రెడ్డి (TG) రూ.5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిని భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణంగా అభివర్ణించిన కేటీఆర్, ఈ విధానం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించబడిందని ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ఐఎల్ పి, వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళఉపయోగ (మల్లీయూజ్) విలువైన రియల్ ఎస్టేట్గా మార్చడానికి రూపొందించబడిందని కెటిఆర్ పేర్కొన్నారు. ఇది కేవలం పాలసీ కాదు. రూ.5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో, రేవంత్రెడ్డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణానికి తెరలేపారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్, అజామాబాద్ సహా హైదరాబాద్ లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

Read also: ‘డిజిటల్ గోల్డ్‌’ను నియంత్రించం: సెబీ చీఫ్

CM Revanth’s conspiracy for Rs 5 lakh crore land scam: KTR

మార్కెట్ విలువ, ఎస్ఆర్ రేట్లు, ఫ్రీహోల్డ్ హక్కులు

ఈ భూముల మార్కెట్(TG) విలువ ప్రస్తుతం ఎకరాకు రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు ఉందని, దీని మొత్తం విలువ రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఆ భూములను రేవంత్ కేవలం ప్రభుత్వ విలువలో 30శాతంకే అప్పగించాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు, ఎస్ఆర్డీ రేట్ల కంటే 100శాతం నుండి 200శాతం అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామన్నారు. కానీ కాంగ్రెస్ కేవలం 30శాతంకే చేయాలని చూస్తోంది. ఎందుకు? ఎవరికి లాభం చేకూర్చడానికి? అని ప్రశ్నించారు. మార్కెట్ ధరలు, ఎస్ఆర్ఎ విలువ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కనీసం ఎస్ఆర్ ను కూడా పూర్తిగా వసూలు చేయడం లేదు. కేవలం 30శాతం మాత్రమే తీసుకుంటున్నారు. మిగిలిన లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రైవేటవ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది భూయజమానులు, బ్రోకర్లు అత్యంత తక్కువ ధరలకు క్రమబద్దీకరణ కోసం తనను సంప్రదించారని, తాము ఆ ప్రతిపాదనలను తిరస్కరించామని కేటీఆర్ వెల్లడించారు.

ప్రభుత్వ చర్యలు, భూమి స్వాధీనం

ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ప్రయోజనం కోసం చౌకగా ఇవ్వలేము. మేము అప్పుడు తిరస్కరించాం. కానీ మేము ఆపిన పనినే ఇప్పుడు రేవంత్ చేస్తున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు. 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయమని చెప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరులు, మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. పాలసీ ఆమోదం పొందడానికి ముందే డీల్స్ కుదిరాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హెచ్ఐఎల్టిపిని ఎటిఎంగా మార్చిందని, ఈ పాలసీని కాంగ్రెస్ పార్టీకి ఎవిఇఎంగా అభివర్ణించిన కెటిఆర్, హెచ్ఎఎల్డీపీ వెనుక ఉన్న ఉద్దేశం పట్టణాభివృద్ధి కాదని, ఎంపిక చేసిన కొద్దిమందిని పెద్దఎత్తున ధనవంతులుగా మార్చడమేనని అన్నారు. ముఖ్యమంత్రి పాలన కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముందు మూసీ నదీ తీరంలోని భూములు. తర్వాత మెట్రో రైలు భూములు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు. ఇప్పుడు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములు… రేవంత్ దృష్టి కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే అని నిరూపించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆయన చుట్టూ భూ డీలర్లు ఉన్నారు.

రాజకీయ ప్రభావాలు: కాంగ్రెస్, బీజేపీ, BRS పాత్ర

ఆయన సోదరులు, సన్నిహితులు ఇప్పటికే ఈభూముల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే పాలసీని తొందరపెడుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. ప్రభుత్వా నికి చిత్తశుద్ధి ఉంటే, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, ప్రజా సంక్షేమంకోసం ఉపయోగించాలని లేదా ముంబై మాదిరిగా బహిరంగ వేలం వేయాలని అన్నారు. దానికి బదులుగా, వారు రూ.5 లక్షల కోట్లు దోచుకోవాలని, కనీసం రూ. 50,000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ తన సొంత జేబులో వేసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారు. ఈలావాదేవీలు నిలబడవు. ఆభూమిని తిరిగి తీసు కుంటాం. బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణను రద్దు చేసి, తగిన చర్యలు ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి భూములను వేలం వేసి ప్రభుత్వం ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంటే.. ఇక్కడమాత్రం అప్పనంగా సంపూర్ణంగా ప్రైవేట్ వ్యక్తుల లబ్దికోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దీనిని వ్యతిరేకించాలి. మౌనంగా ఉంటే, కాంగ్రెస్, బీజేపీ కలసిపోయాయని అర్థమని అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bRS-party HILTP hyderabad-industrial-lands industrial-policy ktr-allegations land-scam political-controversy public-welfare real-estate revanth-reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.