📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG: నీ రౌడీ భాష మార్చుకో సీఎం! కవిత వార్నింగ్‌

Author Icon By Rajitha
Updated: November 9, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kavitha) సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంపై, కళాశాలల యాజమాన్యాలను బెదిరించే రీతిలో మాట్లాడటం తగదని ఆమె మండిపడ్డారు. “ముఖ్యమంత్రి వీధి రౌడీలా ప్రవర్తించడం సిగ్గుచేటు” అని కవిత వ్యాఖ్యానించారు. హన్మకొండలో జరిగిన ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆమె, రేవంత్ రెడ్డి “తాట తీయడం, తోలు తీస్తా” వంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. “వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా మాట్లాడుతున్న సీఎం భాష మారాలి” అని ఆమె హెచ్చరించారు.

Read also: Pension Scheme: వృద్ధులకు రూ.4 వేల, మహిళలకు రూ.2500 సాయం త్వరలోనే

TG: నీ రౌడీ భాష మార్చుకో సీఎం! కవిత వార్నింగ్‌

రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని

TG: ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలహీనంగా ఉన్న సమయంలో, తెలంగాణలో విద్యా అవకాశాలు కల్పించేందుకు యాజమాన్యాలు ఎంతో కృషి చేశాయని కవిత గుర్తుచేశారు. “విద్యార్థుల కోసం శ్రమించిన వారిని ఇప్పుడు బెదిరించడం అన్యాయం” అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,800 కాలేజీలు ఉన్నప్పటికీ, కేవలం రెండు కాలేజీలను టార్గెట్ చేయడం అన్యాయమని ఆమె అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పేద విద్యార్థులకు ఎంతో అవసరమని, ఈ విషయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని కవిత సూచించారు. రేవంత్ రెడ్డి వరంగల్ వరద బాధితులను పరామర్శించినా, నిధులు విడుదల చేయలేదని ఆమె విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Kalvakuntla Kavitha latest news Revanth Reddy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.