హైదరాబాద్ : ఇన్సర్వీస్ టీచర్లకు గుదిబండగా మారిన టెట్ తప్పనిసరి రద్దుకై ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి (Pingili Sripal Reddy) తెలిపారు. (TG)టెట్ తప్పనిసరి నిబంధనను రద్దు చేయాలనే డిమాండ్తో అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫివో) వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోని పిఆర్ టియు టిఎస్ కార్యా లయంలో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర బాధ్యుల సమావేశం జరిగింది.
Read Also: Mahesh Kumar Goud: కెటిఆర్ నిజాలు చెప్పాలి
ఉపాధ్యాయుల భవిష్యత్తు, ఉద్యోగ నిర్ధారణ కోసం పోరాటం
సమావేశంలో శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. (TG) ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ ఉత్తీర్ణత పొందాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమ స్యను పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని సమస్య తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు. ఢిల్లీలోని, జంతర మంతర్ వద్ద ఉదయం 10 గంటల నుంచి ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తు న్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలా ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొన బోతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, అడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితోపాటూ వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: