రికవరీలో మొదటి స్థానంలో తెలంగాణ
హైదరాబాద్: సెల్‌ఫోన్ల(Cell phones) చోరీలు, మిస్సింగ్ కేసుల దర్యాప్తు మరియు నేరగాళ్ల నుంచి రికవరీలో తెలంగాణ(Telangana) సీఐడీ (CID) విభాగం దేశంలో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయంలో ఏడాదిగా మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసు విభాగం దేశవ్యాప్తంగా అన్ని పోలీసు విభాగాల గణాంకాల పరిశీలన తర్వాత తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుంది. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ(Department of Telecommunications) సహకారంతో దేశవ్యాప్తంగా ఏర్పాటైన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR)ను తెలంగాణలో 2023 ఏప్రిల్‌లో అమలు చేశారు.
Read also: Kancharla Srikanth: ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం – సిఎం, డిసిఎం చిత్రాలకు పాలాభిషేకం

రికార్డు స్థాయిలో రికవరీ వివరాలు
సీఈఐఆర్ అమలులోకి వచ్చినప్పటి నుంచి, అంటే దాదాపు రెండున్నరేళ్ల కాలంలో, రాష్ట్ర పోలీసు విభాగం లక్షా 20 వేల సెల్‌ఫోన్లను రికవరీ చేసి రికార్డు సృష్టించింది. ఈ విజయాన్ని సాధించడంలో సీఐడీ ఆధ్వర్యంలో పనిచేసే ప్రత్యేక విభాగం రాష్ట్రవ్యాప్తంగా 31 పోలీసు యూనిట్లలోని 780 పోలీసు స్టేషన్లకు సీఈఐఆర్ యూజర్ ఐడీలను అందజేసింది.
- హైదరాబాద్: రెండున్నరేళ్లలో 84,300 ఫోన్లు చోరీ/మిస్సింగ్ కాగా, ఇందులో 8,382 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- కామారెడ్డి జిల్లా: 9,638 ఫోన్లు మిస్సింగ్ కాగా, 3,860 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా: 4,192 ఫోన్లు మిస్సింగ్ కాగా, 2,074 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- జోగుళాంబ గద్వాల జిల్లా: 4,155 ఫోన్లు మిస్సింగ్ కాగా, 1,998 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- సూర్యాపేట జిల్లా: 5,141 ఫోన్లు మిస్సింగ్ కాగా, 2,267 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సెల్‌ఫోన్ల రికవరీలో సీఐడీ సాధించిన ఘనతపై ఆ విభాగం అదనపు డీజీ చారు సిన్హా సంతోషం వ్యక్తం చేశారు.
సెల్‌ఫోన్ల రికవరీలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
తెలంగాణ రాష్ట్రం.
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR)ను తెలంగాణలో ఎప్పుడు అమలు చేశారు?
2023 ఏప్రిల్‌లో అమలు చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: