📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG Cabinet: తెలంగాణ కేబినెట్ లో పలు కీలక అంశాలపై చర్చలు

Author Icon By Aanusha
Updated: October 16, 2025 • 10:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ పేరుతో ఉత్సవాలు నిర్వహించనుంది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  (Chief Minister Revanth Reddy)నేతృత్వంలో సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాలనలోని విజయాలను, ప్రజలకు అందించిన సేవలను హైలైట్ చేయడం, భవిష్యత్తులో ప్రజలకై చేపట్టే ప్రణాళికలను తెలియజేయడం కోసం ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి.

Read Also: TG Govt: ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని మంత్రివర్గం నిర్ణయం

సచివాలయంలో జరిగిన భేటీ (TG Cabinet) లో బీసీ రిజర్వేషన్లు, అభివృద్ధి ప్రాజెక్టులు, ఇతర కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి ప్రత్యేక కార్యక్రమాల సమాహారం రూపొందించారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలు, పేదలకు , వర్గాలకై చేపట్టిన సంక్షేమ పథకాల పురోగతి, ప్రభుత్వ పథకాలలో పారదర్శకత వంటి అంశాలను ప్రజలకు తెలియజేయడం ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం.

TG Cabinet

కేబినెట్ (TG Cabinet) నిర్ణయ ప్రకారం, ఈ ఉత్సవాలను డిసెంబర్ 1 నుండి 9వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి జిల్లాలో, ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలతో నేరుగా పరస్పర సంబంధాన్ని పెంపొందిస్తారు. ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, వారిలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడం ఈ వేడుకల ముఖ్య లక్ష్యంగా ఉంది.

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల

మంత్రివర్గ సమావేశంలో వెనుకబడిన తరగతుల (Backward Classes) రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయ వివాదం కూడా చర్చనీయాంశమైంది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు (Supreme Court) లో దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ (SLP) కొట్టివేయబడటంతో.. తదుపరి కార్యనిర్వహణ ఎలా ఉండాలనే దానిపై మంత్రులు చర్చించారు.

ఈ అంశం సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.వారి అభిప్రాయాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని సీఎం సంబంధిత అధికారులకు ఆదేశించారు. రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధతను కాపాడుకుంటూనే,

బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమీక్షలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు ప్రభుత్వ సలహాదారులు కూడా పాల్గొన్నారు.

ead hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Revanth Reddy telangana government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.