రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల(Chevella) వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు(RTC bus) ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 25 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా తాండూరు, చేవెళ్ల ప్రాంతాలకు చెందిన వారేనని సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
Read Also: Ramya Krishna: అమ్మోరు’ అమ్మవారు, ‘శివగామి’ రాజమాత – కొత్త లుక్
ఘటనాస్థలం వద్ద స్థానికుల నిరసన
ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో, ఘటనాస్థలం వద్ద స్థానికులు తీవ్ర ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోడ్డు విస్తరణ పనులను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న మృతుల సంఖ్య
గాంధీ ఆసుపత్రి, ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: