📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

TG: జిల్లాల ఎత్తివేతపై భట్టి విక్రమార్క క్లారిటీ

Author Icon By Saritha
Updated: January 22, 2026 • 6:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(TG) రాష్ట్రంలోని జిల్లాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని, కొన్ని జిల్లాలను ఎత్తివేస్తరానే ప్రచారం జరిగింది. తాజాగా, ఈ ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెరదించారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు గత ప్రభుత్వం శాస్త్రీయత లేకుండా, కేవలం ‘లక్కీ నంబర్’ ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని విమర్శించిన నేపథ్యంలో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైన జిల్లాలను ఎత్తివేసే ఆలోచన ప్రస్తుత ప్రభుత్వానికి లేదని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు.

Read Also: Minister Tummal: అన్ని జిల్లా కేంద్రాల్లో నర్సరీ మేళాలను ప్రోత్సహించాలి

Bhatti Vikramarka gives clarity on the abolition of districts.

ఆరోపణలను ఖండించిన భట్టి విక్రమార్క

(TG) సింగరేణి సంస్థలో భారీ కుంభకోణం జరుగుతోందంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ‘సింగరేణి అనేది ప్రజల ఆస్తి. దానిని దోపిడీకి గురికాకుండా కాపాడే బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒడిశాలోని నైని బ్లాక్ గనుల సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ పేరుతో అక్రమాలకు తెరలేపారని విపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ అంశంపై రేపు పూర్తి వివరాలతో, ఆధారాలతో సహా మాట్లాడతానని విపక్షాల కుట్రలను ప్రజల ముందు ఉంచుతానని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

bhatti vikramarka Deputy CM district reorganization false rumors Latest News in Telugu Revanth Reddy Telangana telangana government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.