📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG Bhandh:14న రాష్ట్ర బంద్: బిసి సంఘాల పిలుపు

Author Icon By Saritha
Updated: October 11, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిజర్వేషన్ల సాధనకు ఎంతైనా పోరాడుతాం: ఎంపి ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ : ఈనెల14న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు బిసి సంఘాలు పిలుపు నిచ్చాయి. బిసి రిజర్వేషన్ల అంశంలో స్టేకు నిరసనగా చేపట్టే రాష్ట్ర బంద్ కు(TG bhandh) రాజకీయాలకు అతీతంగా అందరూ కలసిరావాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు. శుక్రవారం బిసి భవన్లో జరిగిన 14 బిసి సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టుతీర్పు పై బిసిలు జీర్ణించు కోలేకపోతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం (State government) తీరుపై అనుమానాలున్నా
యని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్నికలను నిలిపి వేస్తూ స్టే ఇవ్వడం ఇదే మొదటిసారన్నారు. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గట్టిపోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. రిజర్వేషన్ల సాధనకు ఎంతవరకైనా తెగించి పోరాడుతామన్నారు. నాలుగు వారాలు ఎన్నికలు వాయిదా వేస్తూ కోర్టు స్టే ఇవ్వడం అన్యాయమని ఆర్. కృష్ణయ్య అన్నారు. ఇది “బీసీల నోటి కాడు అన్నం ముద్దను లాక్కోవడమే” అన్నారు. గురువారం జడ్పిటీసి, ఎంపిటిసిల స్థానాలపై వేలాదిమంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కోర్టు ఎలా స్టే ఇస్తుందన్నారు.

Read also: రుషికొండ భవనంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

బిసిల రిజర్వేషన్లపై కోర్టు తీర్పు అన్యాయం – ఆర్. కృష్ణయ్య ఫైర్

రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని రాజ్యంగంలోని 243/ డి6 షెడ్యూల్ స్పష్టంగా ఉందని అన్నారు. కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. బిసిలు ఎంత ఉన్నారో.. తమకు అంత రిజర్వేషన్లు ఇవ్వాలినసందేనని డిమాండ్ చేశారు. బిసి బిల్లును పార్లమెంట్లోనూ పెట్టాలని పోరాడు తున్నామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతుగా కలిసి రావాలని పిలుపు నిచ్చారు. రిజర్వేషన్లపై బిసిలు గంపెడాశలు పెట్టుకున్నారని, ఎట్టి పరిస్థితుల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిసి సంఘాల ప్రతినిధులు గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, నీల వెంకటేష్, అంజి, అనంతుల రామమూర్తి గౌడ్, అల్లంపల్లి రామకోటి, టీ. రాజకుమార్, రాజు నేత, చెరుకు మణికంఠ, లింగయ్య యాదవ్, పగిలిన సతీష్, రాందేవ్ మోడీ, అంజనేయులు, రామనర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్ 14న రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని బిసి సంఘాల పిలుపు

బిసిల 42 శాతం రిజర్వేషన్లపై జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 14న జరిగే ‘రాష్ట్ర వ్యాప్త బంద్’ చరిత్రలో ఎన్నడు జరగని విధంగా బిసి లోకం చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, గ్రామాల్లో సైతం ఈ బంద్(TG bhandh) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన 22 బిసి సంఘాల సమావేశంలో ఆర్. కృష్ణయ్య ప్రసంగించారు. చట్ట సభలలో రిజర్వేషన్లు సాధించేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ ఉద్యమం ప్రజాస్వామ్య బద్దంగా బిసిల ఆత్మగౌరవం కోసం, అవమానాలకు వ్యతిరేకంగా కొనసాగుతుం దన్నారు. హైకోర్టు ఎన్నికల ప్రక్రియను ఆపడం దురదృష్టకరమని ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఎన్నికలను ఆపరాదని, గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఆ ఆదేశాలకు విరుద్దంగా వాయిదా వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నిర్ణయిం రాష్ట్రంలోని 56 శాతం బిసి ప్రజల హక్కులకు విఘాతం కలిగి స్తుందని, బిసిల ఆత్మగౌరవం దెబ్బతినడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి మాట్లాడుతూ దేశంలో బిసిలు బిచ్చగాళ్ళు కాదని, వాటా దారులని, కాని ప్రభుత్వం బిసిలను ద్వీతీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నదని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BC Reservations BC welfare High Court stay latest news political support r krishnaiah Social Justice Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.